Sonia Gandhi and Rahul Gandhi: ఆక్సిజన్ మాస్క్‌తో విమానంలో సోనియా గాంధీ.. భావోద్వేగానికి గురైన రాహుల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi and Rahul Gandhi: తనకు అమ్మ సోనియా గాంధీ అంటే ఎంత ప్రేమో.. పలు సందర్భాల్లో రాహుల్ గాంధీ తీసుకునే జాగ్రత్త చర్యలు ఇట్టే చెబుతుంటాయి.. అయితే, రాహుల్ గాంధీ తాజాగా, సోషల్ మీడియాలో షేర్ చేసిన సోనియా గాంధీ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. ఇంతకీ రాహుల్ ఎందుకు ఆ ఫొటో షేర్ చేశారనే విషయంలోకి వెళ్తే.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మంగళవారం బెంగళూరులో విపక్షాల ఐక్యవేదిక సమావేశం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వెళ్తుండగా.. సాంకేతిక లోపం కారణంగా, వారి చార్టర్డ్ విమానం భోపాల్‌లోని రాజా భోజ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. దీంతో విమానంలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది.. ఇక, రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ఖాతాలో సోనియా గాంధీ ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగ పోస్ట్ రాశారు.
సోనియా గాంధీ ఫోటోను రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. “అమ్మా, ఒత్తిడిలో కూడా దయకు సరైన ఉదాహరణ.” అంటూ కామెంట్ రాసుకొచ్చారు.. ఈ ఫోటోలో సోనియా గాంధీ ఆక్సిజన్ మాస్క్ ధరించి కనిపించారు. చార్టర్డ్ విమానంలో ఆక్సిజన్ కొరత ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే పీసీ శర్మ అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెంగళూరు నుంచి ఢిల్లీకి ఈ విమానంలో వెళ్తున్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత ఇద్దరూ భోపాల్ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో బస చేశారు. ఈ సందర్భంగా భోపాల్‌కు చెందిన కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకుని ఆయనను కలిశారు. దాదాపు గంటన్నర సేపు భోపాల్ ఎయిర్‌పోర్టులో బస చేసిన అనంతరం ఇద్దరూ రాత్రి 9.35 గంటలకు ఇండిగో విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
నివేదిక ప్రకారం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెంగళూరు నుండి ఢిల్లీకి వెళ్తున్న ప్రైవేట్ జెట్‌లో.. పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించాడు. ఆ తర్వాత, ముందుజాగ్రత్తగా, భోపాల్ ATC ల్యాండింగ్ గురించి మాట్లాడింది. అనుమతి లభించడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కాగా, మంగళవారం బెంగళూరులో విపక్షాల ఐక్యవేదిక రెండో రోజు సమావేశం ముగిసింది.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు 26 ప్రతిపక్ష పార్టీలు ఒక్కటయ్యాయి. ఈ సమావేశంలో విపక్షాల కూటమి పేరును INDIAగా ఖరారు చేశారు. ఇది ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ గా పేర్కొన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!