SpiceJet Flight: స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ముంబై-బెంగళూరు విమానంలో ఓ ప్రయాణికుడు గంటన్నర పాటు టాయిలెట్లో ఇరుక్కుపోయాడు. సాంకేతిక లోపంతో టాయిలెట్ గేటు తెరుచుకోకపోవడంతో ప్రయాణికుడు బయటకు రాలేకపోయాడు.
Suchana Seth: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ సీఈఓ సుచనా సేథ్ కేసుల యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కొడుకని చూడకుండా.. నాలుగేళ్ల పిల్లాడిని అత్యంత క్రూరంగా హతమార్చింది. కొడుకు మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని గోవా నుంచి కర్ణాటకకు వెళ్తుండగా.. గోవా పోలీసులు ఆమెను చిత్రదుర్గలో అరెస్ట్ చేశారు. నిందితురాలు జనవరి 6న గోవాలోని కాండోలిమ్ లోని సర్వీస్ అపార్ట్మెంట్లో తన కొడుకు గొంతు నులిమి చంపింది. ఈ ఘటన తర్వాత ఆమె కూడా చనిపోయేందుకు ప్రయత్నించిందని కేసు…
Karnataka: బెంగళూర్‌లోని కర్ణాటక అసెంబ్లీ ముందు 8మంది కుటుంబ సభ్యులు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకు అప్పు తీర్చనందుకు తమ ఇంటిని బ్యాంకు వేలం వేయడంతో బాధలో ఆ కుటుంబ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది.
బెంగళూరులోని ఓ స్టార్టప్ కంపెనీ సీఈవో తన నాలుగేళ్ల కొడుకును గోవాలోని ఓ హోటల్లో హత్య చేసింది. ఆమెను కర్ణాటకలోని చిత్రదుర్గ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కన్నడ మాతృ భాషా సమగ్రాభివృద్ధి (సవరణ) ఆర్డినెన్స్‌కు కర్ణాటక కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇప్పుడు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, ఆసుపత్రులు, సంస్థలకు ఏర్పాటు చేసే 'సైన్‌బోర్డ్‌లు' అలాగే నేమ్‌ప్లేట్లలో 60 శాతం కన్నడ భాషను ఉపయోగించాల్సి ఉంటుంది అని సిద్ధరామయ్య సర్కార్ వెల్లడించింది.
బెంగళూరులోని తన నివాసంలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి తన తండ్రి లైసెన్స్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు గురువారం తెలిపారు.
Bengaluru : బెంగళూరులోని ఓ బిల్డింగ్ 33వ అంతస్తు నుంచి పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు తన స్నేహితుడి ఫ్లాట్‌పై నుంచి కింద పడిపోయాడు.
బెంగళూర్ లోని షాపుల నేమ్ బోర్డులపై కన్నడ భాషను ఉపయోగించడంపై బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. అన్ని హోటళ్లు, మాల్స్, ఇతర దుకాణాలు తమ నేమ్ బోర్డులపై తప్పనిసరిగా కన్నడను ఉపయోగించాలని, పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కార్పొరేషన్ హెచ్చరించింది.
Acid Attacks: దేశవ్యాప్తంగా నేరాల వివరాలను వెల్లడించే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) ఇటీవల తన నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, యూటీల్లో నేరాల తీరును ఇందులో పేర్కొంది. 2022లో దేశంలో మహిళలపై ఎక్కువ యాసిడ్ దాడులు జరిగిన నగరాల్లో బెంగళూర్ నగరం మొదటి స్థానంలో ఉన్నట్లు ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది.
Rapido: బెంగళూర్‌లో దారుణం జరిగింది ఓ ర్యాపిడో డ్రైవర్ మహిళా ప్రయాణికురాలిపై అఘాయిత్యానికి యత్నించాడు. రాపిడో ఆటో డ్రైవర్ సదరు మహిళను లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని బాధిత మహిళ స్నేహితుడు అంకుర్ బాగ్చి బుధవారం ఎక్స్(ట్విట్టర్)లో వెల్లడించారు. తన స్నేహితురాలిని రాపిడో ఆటో డ్రైవర్ అనుచితంగా తాకడమే కాకుండా ఆమె ప్రతిఘటించడంతో కదులుతున్న వాహనం నునంచి బలవంతంగా బయటకు తోసేశాడని వెల్లడించారు.