Road Accidents: ఇండియాలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం, చాలా సందర్భాల్లో రోడ్ల పరిస్థితులు సరిగా లేకపోవడం, ఓవర్ స్పీడ్, వాహనదారుల అజాగ్రత్త ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా రోడ్లను పట్టించుకోకపోవడం కూడా సమస్య తీవ్రతను పెంచుతోంది. తాజాగా రోడ్డు రవాణా మంత్రి శాఖ వెల్లడించిన నివేదికలో ఇండియా వ్యాప్తంగా 2022లో రోడ్డు ప్రమాదాలు పెరిగినట్లు తేలింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని వీరభద్ర నగర్లోని బస్ డిపోలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో దాదాపు పది బస్సులు దగ్ధమయ్యాయి. దాదాపు 50 బస్సులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం.
Honour Killing: కర్ణాటకలో మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. దళిత యువకుడితో పారిపోయిందని ఓ తండ్రి కన్న కూతురిని కిరాతకంగా చంపాడు. ఈ ఘటన నాగనాథపురలోని డాక్టర్స్ లే అవుట్లో అక్టోబర్ 21న జరిగింది. కూతురిని చంపిన తర్వాత నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. నిందితుడిని మైసూరులోని హెచ్డీ కోటేలోని కలిహుండి గణేశ(50)గా గుర్తించారు. కూతురిని చంపే క్రమంలో అడ్డుగా వచ్చినందుకు భార్య శారదతో పాటు భార్య సోదరి గీత, అతని భర్త శాంతకుమార్ ను…
live-in relationship: శ్రద్ధా వాకర్ దారుణ హత్య.. లివ్-ఇన్ రిలేషన్షిప్ లోని భయకర కోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధాను అతి కిరాతకంగా నరికి ఫ్రిజులో పెట్టిన సంఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. ఈ ఘటన తర్వాత లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న పలువురు యువతులు హత్యలకు గురవ్వడమో, లేకపోతే హింసించబడటమో జరిగింది. లివ్ ఇన్ లో ఉన్న యువతులు తమను పెళ్లి చేసుకోవాలని కోరడం హత్యలకు దారి తీశాయి. కొన్ని…
Karnataka: భర్తగా భార్యను కలకాలం కాపాడాల్సిన వాడే రాక్షసుడిగా ప్రవర్తించాడు. పెళ్లి తర్వాత తనకు తోడుగా ఉంటాడనుకున్న వాడే దారుణంగా ప్రవర్తించాడు. భార్యతో ప్రైవేటుగా ఉన్న వీడియోలను తీసి ఆమెను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. పెళ్లి ముందు ఉద్యోగం ఉందని నమ్మించి యువతిని పెళ్లి చేసుకున్నట్లు విచారణలో తేలింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని అత్తిబెలెలోని ఓ బాణసంచా దుకాణంలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో షాపు యజమాని సహా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
చోరీకి కాదేది అనర్హం అన్న తీరుగా దేశంలో పరిస్థితి తయారైంది. ఎక్కడ చూసినా దొంగలు అవాక్కయేలా చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఘటన స్థానికులను షాక్కు గురి చేసింది.
Birthday Party: బర్త్ డే వేడులకు చాలా గ్రాండ్గా జరపాలని తల్లిదండ్రులు భావిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద తప్పులకు దారి తీస్తుంటాయి. క్యాండిల్స్, ఫోమ్ కారణంగా కొన్నిసార్లు అగ్ని ప్రమాదాలు సంభవించిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా బెంగళూర్ లో ఓ బర్త్ డే వేడుకల్లో తృటిలో ప్రాణాపాయం తప్పింది. బెలూన్లు పేలి నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి.
Electric Car Catches Fire: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లను విరివిగా కొనుగోలు చేస్తున్నారు. అయితే గతంలో కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలిపోవడం, బ్యాటరీలు పేలిపోవడం చూశాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది కూడా మరణించారు. అయితే ఆ తరువాత మరింత పకడ్బందీగా కంపెనీలు ఈవీల భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. అయితే స్కూటర్ల విషయాన్ని పక్కన పెడితే, కార్లలో మాత్రం మంటలు చెలరేగడం చాలా అరుదుగా చూశాం.