Bengaluru: భార్య మరొకరితో పరారీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్నేహితులన్నాక ఒకరికొకరు సాయం చేసుకోవడం.. ఒకరి బాధలు మరొకరు పంచుకోవడం అనేది ఫ్రెండ్‌షిప్‌లో కామన్. సినిమాల్లో చూసినట్లుగా ప్రేమికులకు స్నేహితులు సహాయం చేయడం చాలా చూసుంటాం. నిజజీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. కొన్నిసార్లు ఎలాంటి ఇబ్బందులు రావుగానీ.. ఇంకొన్ని సార్లు మాత్రం ప్రాణాల మీదకు వస్తుంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? ఓ జంట పారిపోవడానికి సహకరించిన పాపానికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు స్నేహితుడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని బాగలగుండెకు చెందిన పండ్ల వ్యాపారి కిరణ్(22), ఆటో డ్రైవర్ అక్షయ్ (21), కెంగేరికి చెందిన వెయిటర్ హేమంత్ (22) ఈ ముగ్గురూ స్నేహితులు. వీరికి కెంగేరిలోని ఓ హోటల్‌లో పనిచేసే మరో వెయిటర్ మరిస్వామి కూడా పరిచయం ఉన్నాడు.
Also Read
గత రెండు నెలలుగా కిరణ్ భార్యతో మరిస్వామికి శారీరిక సంబంధం ఏర్పడింది. దీంతో ఆమెతో పారిపోవాలని మరిస్వామి నిర్ణయించుకున్నాడు. స్నేహితుడైన హేమంత్ సహాయం కోరాడు. అందుకు అతడు సరే అన్నాడు. ఇంకేముంది కిరణ్ భార్య, మరిస్వామి పారిపోయేందుకు హేమంత్ సహకరించాడు. ఈ విషయం తెలుసుకున్న కిరణ్.. హేమంత్‌పై పగతో రగిలిపోయాడు. తన భార్య పారిపోవడానికి స్నేహితుడే సహకరిస్తాడంటూ హేమంత్‌ను చంపేయాలని కిరణ్ ప్రణాళిక రచించాడు. దీనికి అక్షయ్ సహాయంతో హేమంత్‌ను కిరణ్ చంపేశాడు.
హేమంత్ హత్య కేసు వెలుగులోకి రావడంతో నిందితులు కిరణ్, అక్షయ్‌ను బాగలగుండె పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు అనంతరం నిందితులకు కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. సాయం చేసిన పాపానికి ఒకరు ప్రాణాలు పోగొట్టుకుంటే… ప్రాణాలు తీసిన మరో ఇద్దరు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!