కర్ణాటక రాజధాని బెంగళూరులోని దాదాపు 15 పాఠశాలలకు ఇవాళ ఉదయం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాఠశాలలన్నింటిని ఖాళీ చేయాలని పోలీసులు తెలిపారు.
ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ ఓలా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది.. ఓలా.. ఇప్పుడు రైడర్లకు తమ క్యాబ్ డ్రైవర్లకు యాప్‌లోనే నేరుగా యూపీఐ ద్వారా చెల్లించే అవకాశాన్ని కల్పిస్తుందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ఓలా ఫౌండర్ మరియు సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు.
బెంగుళూరులో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈవెంట్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్‌లో ప్రయాణించారు. పూర్తిగా స్వదేవీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన ఈ తేజస్ యుద్ధ విమానంలో ఆయన ఓ ట్రిప్ వేశారు.
కర్ణాటక బెంగుళూరులో దారుణ ఘటన వెలుగు చూసింది.. తన కూతురిని వేధిస్తున్నాడన్న ఆరోపణతో 21 ఏళ్ల యువకుడిని హత్య చేసిన వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.. బాధితుడిని విల్సన్ గార్డెన్లో ఫుడ్ డెలివరీ చేస్తున్న డేవిడ్‌గా గుర్తించారు.. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఆనేపాల్యలో నివసిస్తున్న మంజునాథ్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతడికి ముగ్గురు పిల్లలు.. అతని రెండో కుమార్తె తో డేవిడ్ అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు.. అతన్ని గత…
కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడు రోజుల్లో పెళ్లి అనగా కాబోయే భర్త ఇంటిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో సోమవారం జరిగింది. అయితే కాబోయే అత్తింటివారే తమ కూతురిని చంపారంటూ మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించడం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెపట్టారు. వివరాలు.. కర్ణాటకలోని విజయనగరం జిల్లాకు చెందిన ఐశ్యర్య, అశోక్ కుమార్‌లు పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మంచి ఉద్యోగంలో సెటిలైన ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ నిర్ణయాన్ని ఇంట్లో చెప్పారు.…
Vistara Airline: ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఓ వీధి కుక్క హల్చల్ చేసింది. దీంతో ల్యాండ్ అవ్వాల్సిన విస్తారా ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం వెనుదిరాగాల్సి వచ్చిన సంఘటన గోవాలోని దబోలిమ్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. సోమవారం విస్తారా ఎయిర్‌లైన్‌కు చెందిన యూకే 881 విమానం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12.55 గంటలకు గోవా బయలుదేరింది. ఆ విమానం దబోలియా ఎయిర్‌పోర్టుకు చేరుకుని సరిగ్గా రన్‌వేపై ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమైంది. అప్పుడే రన్‌వే పై ఎయిర్ ట్రాఫిక్…
Man Wear Paper Bag: సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వింత సంఘటనలు, ఆసక్తికర వీడియోలు బయటకు వస్తూనే ఉంటాయి. తమ టాలెంట్‌ను బయట పెడుతూ చాలా మంది సోషల్ మీడియాకు ఎక్కితే.. మరికొందరు తమ విచిత్ర ప్రవర్తన, వినూత్న ఆలోచనతో వైరల్ అవుతారు. తాజాగా అలాంటి సంఘటనే మరోకటి సోషల్ మీడియాకు ఎక్కింది. సాధారణంగా వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. నడిపే వ్యక్తే కాదు వెనకాల కూర్చుకున్న వాళ్లు కూడా హెల్మెట్ ధరించాలనేది ట్రాఫిక్ రూల్. లేదంటే…
House Rent Hike: గత తొమ్మిది నెలల్లో భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగాయి. ఐటీ సిటీ బెంగళూరులో గత జనవరి-సెప్టెంబర్ మధ్య రెసిడెన్షియల్ అద్దెలు దాదాపు 31 శాతం పెరిగాయి.
బెంగళూరు నగరంలో గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కురుస్తున్న కుండపోత వర్షాల ధాటికి రాష్ట్రం లో పలు చోట్ల జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. కాగా సోమవారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి బెంగళూరు లోని వెస్ట్ డివిజన్ లోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ ఆయుధశాల గోడ కూలిపోయింది.