ప్రముఖ నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అందులో బెంగుళూరు ట్రాఫిక్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే.. ఈ మధ్య బెంగుళూరు ట్రాఫిక్ గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదోక వార్త వైరల్ అవుతూ వస్తుంది.. ఇప్పుడు మరో వార్త నెట్టింట వైరల్ గా మారింది..
అసలు విషయానికొస్తే .. బెంగళూరులోని కబ్బన్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ఓ ట్రాఫిక్ సైన్ బోర్డు రోడ్డు వద్ద ట్రాఫిక్ రూల్స్ కోసం ఇచ్చిన ఒక బోర్డ్ అందరి దృష్టిని ఆకర్శించింది.. ఈ సైన్ బోర్డుకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రతి ఒక్కరు కూడా దీనిపై పెద్ద ఎత్తున పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.. ఇక సోషల్ మీడియాలో ఈబోర్డు కు సంబందించిన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి..
ట్రాఫిక్ సైన్ బోర్డులో రెండు వేర్వేరు ఫాంట్ సైజుల్లో పదాలు రాశారు. ట్రాఫిక్ లైట్స్ లోని రెడ్, యెల్లో, గ్రీన్ లైట్స్ ను హైలైట్ చేస్తూ, ఈ సైన్ బోర్డ్ లో కామెంట్ ను రాశారు. అదేంటంటే .. ఫాలో ట్రాఫిక్ రూల్స్.. సమ్ వన్ ఈజ్ వెయింటింగ్ ఫర్ యూ.. ఎట్ హోం అనే వ్యాక్యాన్ని ట్రాఫిక్ లైట్స్ లోని రెడ్, యెల్లో, గ్రీన్ లైట్స్ ను హైలైట్ చేస్తూ.. రెండు వేర్వేరు ఫాంట్ సైజుల్లో ప్రింట్ చేశారు.. అక్కడ ట్రాఫిక్ రూల్స్ కోసం పోలీసులు కొత్త ఆలోచన చూపరులను తెగ ఆకట్టుకుంటుంది.. ఫిబ్రవరి 25 న షేర్ చేసినప్పటి నుండి, ఎక్స్ పోస్ట్ కు భారీగా లైకులు , అలాగే అనేక కామెంట్లు వచ్చాయి. ఇక చాలామంది ఈ సైన్ బోర్డుపై తమ ప్రతిస్పందనను పంచుకున్నారు… మొత్తానికి పోలీసులు క్రియేటివిటి ఐడియా వర్కౌట్ అయ్యిందని తెలుస్తుంది..