Telangana : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యంత కీలకంగా మారింది. సర్పంచ్ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చకు దారితీసింది. అయితే, ఈ హామీని అధికారికంగా కాకుండా పార్టీ పరంగా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన జీఓ (GO)పై ప్రస్తుతం హైకోర్టులో…
హనుమకొండలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని అన్నారు.
Ponnam Prabhakar : కుల గణనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఆదివారం మూసాపేటలోని మెజెస్టిక్ గార్డెన్స్‌లో జరిగిన మున్నూరు కాపు, కాపుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోకాపేటలో మున్నూరు కాపు భవనం నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3)ని తొలిగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్ సహా పురపాలక చట్టాల సవరణ చేయనున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పునరుద్ధరణపై భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంది. 1. ప్రపంచంలోనే…
Telangana Bandh Today: నేడు తెలంగాణ బంద్‌కు బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు బంద్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్ ప్రకటించారు. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లండని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని ధర్మాసనం హైకోర్టుకు సూచించింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి తీసుకునే చర్యలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో జరుగనున్నకేబినెట్ భేటీలో…
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపైనే స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీల రిజర్వేషన్ల భవితవ్యం ఆధారపడి ఉన్న నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం ఏ తీర్పు ఇస్తుందోనని అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్న వారు…
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై అక్టోబర్ 9వ తేదీన హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో ఎస్‌ఎల్‌పీ పిటిషన్ వేసింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడా నిబంధనలు లేవని పిటిషన్లో ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు మాత్రమే దాన్నో మార్గదర్శక సూత్రంగా…
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే జీవోపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఈరోజు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) వేయనుంది. న్యాయ నిపుణుల సూచనలతో పిటిషన్ దాఖలుపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను సిద్ధంగా ఉంచారు. ఈ అంశంపై ఏజీ సుదర్శన్ రెడ్డి, సుప్రీం…