Vijaya Sai Reddy: అమరావతిలోని తాడేపల్లిలో వైసీపీ బీసీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, పలువురు బీసీ మంత్రులు, బీసీ కార్పొరేషన్‌ల ఛైర్మన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు, ఐపాక్ సహకారంతో ఈ సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని విజయసాయిరెడ్డి సూచించారు. అప్పుడే బీసీలకు నిజమైన న్యాయం జరుగుతుందన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లపై కూడా పోరాటం చేయాలని…
వెనుకబడిన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని, జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు.
మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై విమర్శల గుప్పించారు. మంగళవారం ఆయన ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ప్రతి ఏటా బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించి, ఖర్చు చేస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని ఆయన మండిపడ్డారు. 2017-18 నుండి 2021-22 వరకు ఎంబీసీ కార్పోరేషన్‌కు బడ్జెట్ కేటాయింపులకు ఖర్చుకు అసలు పొంతనే లేదని ఆయన వెల్లడించారు. ఎంబీసీలకు గడిచిన నాలుగు బడ్జెట్‌లలో 3 వేల కోట్లు కేటాయించినట్లు కాగితాల్లో కనిపిస్తున్నా ఫైనాన్స్ విభాగంలో ఆమోదం…