Hindus In Bangladesh: దుర్గాపూజ చేయాలంటే రూ. 5 లక్షలు ఇవ్వండి.. హిందూ టెంపుల్స్ కి బెదిరింపులు..!
- బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాల్లో విగ్రహాలు ధ్వసం..
- దుర్గాపూజ చేయాలంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని బెదిరింపు..
- యూనస్ సర్కార్ కు ఫిర్యాదు చేసిన హిందూ సంఘాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindus In Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ హిందూ సమాజమే లక్ష్యంగా బెదిరింపులకు దిగుతున్నారు. దుర్గుపూజ చేసుకునేందుకు 5 లక్షల బంగ్లాదేశ్ టాకా ఇవ్వాలని ఇస్లామిక్ ఛాందసవాద గ్రూపులు దేవాలయాలు, కమిటీలకు బెదిరింపు లేఖలు పంపినట్లు సమాచారం. ఆ మొత్తం చెల్లించకుంటే పూజకు అనుమతించబోమని చెప్పారు. అలాగే, దుర్గామాత విగ్రహాన్ని పగలగొడతామంటూ హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: ED Raids : చైనా 400 కోట్ల గేమింగ్ యాప్ కుట్ర బట్టబయలు చేసిన ఈడీ ..రూ.25కోట్లు స్వాధీనం
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
- Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం'
కాగా, రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు దుర్గాపూజ చేయడానికి దేవాలయాల నుంచి 5 లక్షల రూపాయలను డిమాండ్ చేశాయని హిందూ సంఘాలు తెలిపాయి. అలాగే, ఖుల్నా జిల్లాలోని డాకోప్‌లో ని హిందూ సంఘాలకు చెందిన పూజా కమిటీలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి లేఖలు వచ్చాయి. చెప్పిన మొత్తాన్ని చెల్లించకుంటే.. దుర్గాపూజకు అనుమతించేది లేదని బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. సెప్టెంబర్ 22న లక్ష్మీగంజ్ జిల్లాలోని రాయ్‌పూర్ ప్రాంతంలో కొందరు మదర్సా కుర్రాళ్లు దుర్గా విగ్రహాలను పగలగొట్టారు. దీంతో పాటు బార్గునా జిల్లాలోని ఒక ఆలయంలో గల విగ్రహాలను ధ్వంసం చేసినట్లు హిందూ సంఘాలు వెల్లడించాయి. ఇక, బంగ్లాదేశ్ లో అక్టోబర్ 9 నుంచి 13 వరకు దుర్గాపూజ జరుపుకుంటారు. విశేషం ఏమిటంటే ఇది బంగ్లాదేశ్ హిందువులకు అతి పెద్ద పండుగ.
Read Also: Dr K Laxman: చాకలి ఐలమ్మ చరిత్ర ను పాఠ్యాంశాల్లో చేర్చాలి..
అలాగే, ఇటీవల చిట్టగాంగ్, ఖుల్నా జిల్లాల అధికారులకు హిందూ సంఘాల సభ్యులు ఫిర్యాదు చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ హిందూ-బౌద్ధ-క్రిస్టియన్ యూనిటీ కమిటీ కూడా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ కమిటీ 6 మంది సభ్యులతో కూడిన సెల్‌ను కూడా ఏర్పాటు అయింది. ఇది మైనారిటీ వర్గాల ప్రజల యొక్క భద్రతను చూసుకుంటుంది. ఇక, చిట్టగాంగ్ జిల్లాకు చెందిన సనాతన్ విద్యార్థి సంసద్ అధ్యక్షుడు కుశాల్ చక్రవర్తి ఛానెల్‌తో మాట్లాడుతూ.. మా మనసుల్లో భయం ఉంది.. మా భద్రత కోసం ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాం.. ఫరీద్‌పూర్, ఖుల్నాతో పాటు అనేక ఇతర ప్రాంతాల్లో విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి.. మేము దుర్గాపూజ కోసం సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు