Bangladesh : బంగ్లాదేశ్ కొత్త తాత్కాలిక ప్రభుత్వం దేశంలో నిరంతరం అనేక మార్పులు చేస్తోంది. అవామీ లీగ్ విద్యార్థి విభాగం గురించి ఎలాంటి వార్తలను ప్రచురించవద్దని బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ప్రత్యేక సహాయకుడు మహ్ఫూజ్ ఆలం గురువారం జర్నలిస్టులను కోరారు. ఇది ఇప్పుడు నిషేధిత సంస్థ అని, ఉగ్రవాద సంస్థ ప్రచారంలో మీరు ఎటువంటి పాత్ర పోషించవద్దని అన్నారు. జర్నలిస్టులను హెచ్చరిస్తూనే, మధ్యంతర ప్రభుత్వం మీడియా స్వేచ్ఛపై ఎలాంటి దాడిని సహించదని, దానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని…
బంగ్లాదేశ్‌లో గార్మెంట్ రంగంపై ఆందోళన పెరిగింది. దీంతో యూఎస్ మార్కెట్లో భారత్ అడుగుపెట్టేందుకు అవకాశం లభించింది. భారతదేశం నమ్మకమైన వస్త్రాల తయారీ దేశంగా ఎదుగుతోంది.
WTC Team India: బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ మిర్పూర్లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య బంగ్లాదేశ్‌ను ఓడించింది. దింతో ఆఫ్రికన్ జట్టు 10 ఏళ్ల తర్వాత ఆసియా ఖండంలో దక్షిణాఫ్రికా టెస్టు విజయాన్ని అందుకుంది. అంతకుముందు 2014లో గాలెలో శ్రీలంకపై ఆసియా ఖండంలో దక్షిణాఫ్రికా చివరి టెస్టు విజయం సాధించింది. ఇక మీర్పూర్ టెస్టులో చిరస్మరణీయ విజయంతో, దక్షిణాఫ్రికా ప్రపంచ…
Bangladesh vs South Africa: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢాకా వేదికగా జరిగిన మ్యాచ్‌లో టోనీ డి జోర్జి (41) రాణించడంతో ప్రొటీస్ జట్టు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సులభంగా సాధించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా జట్టు దూకుడు ప్రదర్శించింది. Read Also: Akhilesh Yadav: యూపీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు…
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆ దేశంలోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ గురువారం ఆమెకు వారెంట్ ఇష్యూ చేసింది. ఈ ఏడాది జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనల్లో షేక్ హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు, పలువురి చావుకు కారణమైనట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆగస్టులో అక్కడి పరిస్థితులు హింసాత్మకంగా మారడంతో హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు.
Bangladesh: పాకిస్తాన్ దారిలో బంగ్లాదేశ్ పయణిస్తోంది. ఆ దేశ జాతీయ సెలువు దినాలను ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది. మార్చి 7, ఆగస్టు 15 వేడుకలతో సహా 8 జాతీయ దినోత్సవాలను రద్దు చేయాలని నిర్ణయించింది. బంగ్లాదేశ్ జాతిపితగా చెప్పబడే షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం, 1971 స్వాతంత్ర్య సంగ్రామం స్పూర్తిపై దాడిగా ఈ నిర్ణయాన్ని పలువురు అభివర్ణిస్తున్నారు.
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ పార్టీ అధినేత్రి షేక్ హసీనాపై బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆగస్టు నెలలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లలో అప్పటి ప్రధానిగా ఉన్న షేక్ హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. షేక్ హసీనాతో పాటు అవామీ లీగ్ నేతలతో సహా 45 మందికి అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
బంగ్లాదేశ్‌కు చెందిన చొరబాటుదారుడు భారత్‌లోకి చొరబడాలంటే.. దాని ఖరీదు రూ.4 వేలు మాత్రమే. అవును.. రూ.4 వేల కోసం బంగ్లాదేశ్ నుంచి సరిహద్దులు దాటి భారత్‌లోకి చొరబడుతున్నారు..
Bangladesh: బంగ్లాదేశ్ పాకిస్తాన్లా తయారయ్యేందుకు ఎంతో కాలం పట్టేలా కనిపించడం లేదు. ఓ విధంగా చెప్పాలంటే పాకిస్తాన్‌ని మించి మతఛాందసవాద రాజ్యంగా మారేలా బంగ్లాదేశ్ పరిస్థితులు ఉన్నాయి.
గత ఏడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఒక ఆటగాడితో అనుచితంగా ప్రవర్తించినందుకు పురుషుల జట్టు ప్రధాన కోచ్ చండికా హతురుసింఘను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) సస్పెండ్ చేసింది. శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ హతురుసింఘా నేతృత్వంలోని బంగ్లాదేశ్ ఇటీవల భారత్‌తో జరిగిన అన్ని టెస్టులు, టీ20 సిరీస్‌లలో ఓటమి పాలైంది. ఈ క్రమంలో.. బీసీబీ (BCB) అతని స్థానంలో వెస్టిండీస్ మాజీ ఆటగాడు ఫిల్ సిమన్స్‌ను నియమించాలని నిర్ణయించింది.