Bangladesh: బంగ్లాదేశ్‌లో ఏదో జరుగుతోంది.. రానున్న కొన్ని రోజుల్లో బంగ్లా రాజకీయాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత షేక్ హసీనా తనను తాను ప్రధానిగా సంభోదిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. మరోవైపు ట్రంప్ గెలవడం ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌కి పెద్ద తన నొప్పిగా మారింది.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యారు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌పై ఆయన విజయం సాధించారు. 2016 నుంచి 2020 వరకు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన ట్రంప్.. అధ్యక్షుడిగా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం ఒక్క అమెరికాకే పరిమితం కాకుండా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్శించింది.
షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి ఇండియా వచ్చినప్పటి నుంచి అక్కడి హిందువుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. మహ్మద్ యూనస్ ఎన్ని వాదనలు చేసినా, తెరవెనుక భారత్‌పై చాకచక్యం ప్రదర్శించడం మానుకోవడం లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ మాల్దీవుల సాయం తీసుకుని భారత్‌తో ‘ఆడుతోంది’. బంగ్లాదేశ్ ప్రపంచంలోని రెండవ అతిపెద్ద వస్త్ర ఉత్పత్తి దేశం.
Bangladesh: బంగ్లాదేశ్ లో మైనారిటీ వర్గాలపై దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అక్కడి హిందువులపై దాడి ఘటనలు ఎక్కువ నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్నిచోట్లా హింస చెలరేగుతుంది. తమకు రక్షణ లేకుండా పోయిందని ఆ దేశ హిందువులు వాపోతున్నారు.
Bangladesh: భారతదేశం పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలు ప్రభుత్వం నుండి రక్షణ కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ముస్లింలు మెజారిటీగా ఉన్న బంగ్లాదేశ్‌లోని మధ్యంతర ప్రభుత్వం దాడులు, వేధింపుల నుండి తమను రక్షించాలని అలాగే హిందూ సమాజ నాయకులపై దేశద్రోహం కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేయడానికి హిందూ సమాజానికి చెందిన సుమారు 300 మంది శనివారం ఢాకాలో సమావేశమయ్యారు. ఆగస్టు నెలలో బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు జరిగినప్పటి నుంచి హిందూ సమాజంపై వేలాది దాడులు జరిగాయని హిందూ సంఘాల…
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా పార్టీతో పాటు సంకీర్ణ సర్కార్ లోని పార్టీలను కష్టాలు వెంటాడుతున్నాయి. ఢాకాలోని హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ కేంద్ర కార్యాలయంపై దుండగులు దాడి చేశారు.
Donald Trump: బంగ్లాదేశ్‌లో మరోసారి హిందువులపై జరిగిన దాడిని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్‌తో అమెరికా సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తామన్నారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా ప్యాలెస్ ‘‘విప్లవ మ్యూజియం’’గా మారుతుందని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ సోమవారం తెలిపారు. హసీనాకు చెందిన విలాసవంతమైన ప్యాలెస్ నుంచి ఆమె పారిపోయేలా చేసిన విప్లవానికి గుర్తుగా ఈ మ్యూజియం మారుతుందని యూనస్ చెప్పారు. ఈ మ్యూజియంలో ఆమె దుర్మార్గమైన పరిపాలన, ఆమెను అధికారం నుంచి తొలగించిన ప్రజలు విప్లవాన్ని భద్రపరుస్తుందని చెప్పారు.
రీల్స్ మోజులో పడి కొందరు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రమాదమని తెలిసి కూడా ఎదురెళ్లుతున్నారు. లేనిపోని కష్టాలు తెచ్చుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌లో జరిగిన ఘటన తీవ్ర ఆందోళన కలిగించింది.
Amit Shah: బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు అక్రమ వలసలు రెండు దేశాల మధ్య శాంతియుత సంబంధాలకు విఘాతం కలిగిస్తాయని, సరిహద్దు చొరబాట్లను ఆపినప్పుడే పశ్చిమ బెంగాల్లో శాశ్వత శాంతి నెలకొంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పెట్రాపోల్ ల్యాండ్ పోర్ట్‌లో కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనం,