Hindu Temples Attack In Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా నిరసనల మధ్య చిట్టగాంగ్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఇందులో హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో భాగంగా మంగళవారం చిట్టగాంగ్‌లో దుండగులు లోక్‌నాథ్ ఆలయం, ఫిరంగి బజార్‌లోని మానస మాత ఆలయం, హజారీ లేన్‌లోని కాళీ మాత ఆలయాన్ని ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందూ నాయకుడు, ఇస్కాన్ సభ్యుడు చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఆయన బెయిల్‌ను కోర్టు…
Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ మతనాయకుడు, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ వివాదాస్పదంగా మారింది. భారత్ ఆయన అరెస్ట్‌పై, బెయిల్ ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, ఇతర మైనారిటీలపై పోలీసుల దాడిని ఖండించింది. మైనారిటీలకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ రోజు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ నేత, హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని బంగ్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దేశంలో హిందువులకు పెద్ద దిక్కుగా ఉన్న బ్రహ్మచారిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. రాజధాని ఢాకాలో ఇతడిని అరెస్ట్ చేశారు. అక్కడి కోర్టులు ఆయనకు బెయిల్‌ని కూడా ఇవ్వకుండా,
Bangladesh: అదానీకి వరసగా షాక్‌లు ఎదురవుతున్నాయి. విద్యుత్ ఒప్పందాల్లో అధికారులకు లంచాలు ఇచ్చాడని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. అయితే, అదానీ గ్రూప్ ఈ ఆరోపణల్ని ఖండించింది. ఈ ఆరోపణలు రావడంతో కెన్యా తమ దేశంలో అదానీ చేపడుతున్న కీలక ప్రాజెక్టుల్ని రద్దు చేసింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత ఆ దేశంలో మైనారిటీ వ్యతిరేకత, ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు నిర్వహిస్తున్నారు. రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు పనిగట్టుకుని హిందువుల వ్యాపారాలు, ఆలయాలు, ఇళ్లపై దాడులు చేస్తున్నారు. రెండు నెలల క్రితం బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర వరదలు సంభవిస్తే, అక్కడి ప్రజలకు ఆహారాన్ని అందించిన ఇస్కాన్ సంస్థనే ఇప్పుడు బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున ఆన్లైన్ క్యాంపెయినింగ్ నడుస్తోంది.
Donald Trump: హిందువులతో పాటు మైనారిటీలపై దాడులకు పాల్పడుతున్న బంగ్లాదేశ్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని భారతీయ అమెరికన్లు కోరుతున్నారు. ఈ మేరకు బంగ్లాదేశ్‌పై ఆర్థిక ఆంక్షలు విధించడంతో పాటు చర్యలు తీసుకోవాలని వచ్చే ఏడాది ఏర్పాటు కాబోతున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ని, యూఎస్ కాంగ్రెస్‌ని సంప్రదించడానికి భారతీయ అమెరికన్లు కృషి చేస్తున్నారు.
Bangladesh-Pakistan: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా పదవి కోల్పోయిన తర్వాత పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు చిగురిస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ కరాచీ నుంచి బంగ్లాదేశ్ చిట్టగాంగ్ పోర్టుకు ఒక కార్గో షిప్ వెళ్లింది. ఇది పాక్-బంగ్లాల మధ్య తొలి సముద్ర సంబంధంగా పేర్కొనబడుతోంది. ఢాకాలోని పాకిస్తాన్ హైకమిషన్ "ద్వైపాక్షిక వాణిజ్యంలో ఒక ప్రధాన అడుగు"గా అభివర్ణించింది, ఈ అభివృద్ధి రెండు దేశాల మధ్య చారిత్రాత్మకంగా బలహీనమైన సంబంధాలలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత అక్కడ రాడికల్ ఇస్లామిస్టులు బలపడుతున్నారు. జమాతే ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ వంటి కట్టర్ ఇస్లాం మద్దతుదారుల చేతిలో మైనారిటీలైన హిందువులు, క్రిస్టియన్స్, బౌద్ధులు అణిచివేతకు, దౌర్జన్యానికి గురవుతున్నారు. ఇన్నాళ్లు బంగ్లాదేశ్ సెక్యులర్ దేశంగా ఉండేది, అయితే ఇకపై పాకిస్తాన్‌లాగే ఇస్లామిక్ రాజ్యంగా మారే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
Bangladesh : షేక్ హసీనా పతనం తర్వాత, బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కోసం ఇంకా ఎన్నికలు జరగలేదు. ఆగస్టు నుంచి ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ మాత్రమే అధికార భోగాలను అనుభవిస్తున్నారు. ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వంలో కూడా అసమ్మతి సంకేతాలు కనిపిస్తున్నాయి. తాత్కాలిక ప్రభుత్వానికి చెందిన ముగ్గురు కొత్త సలహాదారులు ఆదివారం సాయంత్రం రాజధానిలోని బంగా భవన్లో ప్రమాణం చేయగా, చాలా మంది సలహాదారుల పోర్ట్‌ఫోలియోలు పునర్వ్యవస్థీకరించబడ్డాయి. ఈ సలహాదారుల నియామకం తరువాత, బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు స్వరాలు…
Bangladesh: బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం షేక్ హసీనాను అప్పగించాలని బలంగా కోరుతోంది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న హసీనాని స్వదేశానికి పంపేలా చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ఇంటర్‌పోల్ సాయాన్ని కోరింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేసిందని షేక్ హసీనాపై బంగ్లాదేశ్ ఆరోపణలు చేస్తోంది.