Bangladesh: బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడులకు అవకాశం.. తమ పౌరులకు యూకే జాగ్రత్త..
- బంగ్లాదేశ్ వెళ్లే వారు జాగ్రత్త..
- ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉంది..
- తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన యూకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని యూకే హెచ్చరించింది. తమ పౌరులు ఆ దేశానికి ప్రయాణించకుండా హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం యూకే ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ‘‘రద్దీగా ఉండే ప్రాంతాలు, మతపరమైన భవనాలు, రాజకీయ ర్యాలీలు వంటి వాటిలో పాటు విదేశీ పౌరులు సందర్శించే ప్రదేశాలతో సహా తీవ్రవాద దాడులు విచక్షణారహితంగా జరగవచ్చు’’ అని యూకే తెలిపింది.
బంగ్లాదేశ్‌లో ఇటీవల కాలంలో మైనారిటీలపై , ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయి. ప్రముఖ హిందూ నేత చిన్మోయ్ కృష్ణదాస్‌పై ఆ దేశం దేశద్రోహ కేసు పెట్టి, అరెస్ట్ చేసింది. అతడికి బెయిల్ కూడా మంజూరు చేయలేదు. ఆయన తరపు వాదించే లాయర్లపై మతోన్మాదులు దాడికి తెగబడుతున్నారు. తాజాగా ఆయన తరుఫు వాదించే ఓ హిందూ లాయర్‌పై దాడి చేయడంతో ఆయన చావుబతుకుల మధ్య ఉన్నాడు. మరోవైపు చిట్టగాంగ్ బార్ అసోసియేషన్‌లో ముస్లిం న్యాయవాదులు, హిందూ న్యాయవాదుల్ని బెదిరిస్తున్నారు.
Also Read
- Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
Read Also: Dulkar Salman : మళ్లీ తెలుగోడి డైరెక్షన్లోనే.. దుల్కర్ సల్మాన్ తో రొమాన్స్ చేయనున్న బుట్టబొమ్మ
ఈ నేపథ్యంలోనే యూకే తన పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ‘‘కొన్ని సమూహాలు ఇస్లాంకు విరుద్ధమైన అభిప్రాయాలు, జీవనశైలి కలిగిన వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకున్నాయి. మైనారిటీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. ప్రధాన నగరాల్లో ఐఈడీ దాడులు ఉన్నాయి. బంగ్లాదేశ్ అధికారులు ప్లాన్డ్ అటాక్స్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’’అని యూకే అడ్వైజరీలో చెప్పింది.
బంగ్లాదేశ్ హిందూ వ్యతిరేక హింసపై యూకే ఆందోళన వ్యక్తం చేసింది. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఎంపీ మంగళవారం హౌజ్ ఆఫ్ కామన్స్‌లో చెప్పారు. ఈ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే యూకే ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. “ప్రసిద్ధ హిందూ నాయకుడు చిన్మోయ్ కృష్ణ దాస్‌ను దేశద్రోహ ఆరోపణలపై అరెస్టు చేసిన తర్వాత భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసిన విషయం మాకు తెలుసు. UK ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ (FCDO) డెస్క్ ఆ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది” అని ఎంపీ కేథరీన్ వెస్ట్ చెప్పారు.
తాజావార్తలు
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!