Blind T20 World Cup Won Pakistan: అంధుల టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను పాకిస్తాన్ గెలుచుకుంది. ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. పాక్ జట్టు ఈ టైటిల్ గెలవడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు చేయగలిగింది. టార్గెట్ ఛేదనలో పాకిస్థాన్ కేవలం 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుని మొదటిసారి అంధుల ప్రపంచకప్‌ను గెలుచుకుంది. పాకిస్థాన్ తరఫున కెప్టెన్ నిసార్ అలీ అజేయంగా 72 పరుగులు చేయగా, మహ్మద్ సఫ్దర్ అతనికి మద్దతుగా నిలిచి అజేయంగా 47 పరుగులు చేశాడు. ఈ విజయం పాకిస్థాన్‌కు చిరస్మరణీయమైనది. దీనికి కారణం, ఈ మొత్తం టోర్నమెంట్‌లో ఎవరూ వారిని ఓడించలేకపోయారు. పాకిస్థాన్ అంధుల క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ సయ్యద్ సుల్తాన్ షా ఈ ఘనత సాధించిన తమ జట్టును అభినందించారు. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ బౌలర్ బాబర్ అలీ 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు మహ్మద్ సల్మాన్, మతివుల్లా ఒక్కో వికెట్ తీశారు.
Also Read: Firing At Golden Temple premises: స్వర్ణ దేవాలయంలో కాల్పులు.. తృటిలో తప్పించుకున్న నేత
PAKISTAN WIN THE BLIND CRICKET T20 WORLD CUP TITLE 🇵🇰❤️❤️❤️
What a stunning 10-wicket win against Bangladesh in the final in Multan. This is how you do it without India. Another very successful event, padosiyo 🇮🇳🔥🔥
— Farid Khan (@_FaridKhan) December 3, 2024
ఈ అంధుల టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ 2012 సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ తర్వాత భారత జట్టు 2017, 2022లో ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. అంధుల టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ హ్యాట్రిక్ సాధించిన భారత్ ఈసారి టోర్నీలో పాల్గొనలేకపోయింది. అంధుల టి20 ప్రపంచ కప్‌ను పాకిస్తాన్‌లో నిర్వహించడం వలన, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించిన వివాదం కారణంగా, భారత ప్రభుత్వం తమ అంధుల జట్టును సరిహద్దు దాటి పంపడానికి నిరాకరించింది. అంధుల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఇప్పటి వరకు రెండుసార్లు ఫైనల్‌కు చేరింది. 2012, 2017 ఎడిషన్లలో వారు భారత్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు 2024లో ఎట్టకేలకు పాకిస్థాన్ జట్టు ఓటమి ట్రెండ్‌కు స్వస్తి పలికి తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది.