Nobel Prize: మహ్మద్ యూనస్ ‘‘హిందువుల కసాయి’’.. నోబెల్ అవార్డుని పున:పరిశీలించాలి..
- బంగ్లాదేశ్ అధినేత మహ్మద్ యూనస్ నోబెల్ అవార్డ్‌ని పరిశీలించాలి.. హిందువుల కసాయిగా మారిన మహ్మద్ యూనస్.. నోబెల్ కమిటీకి లేఖ రాసిన బీజేపీ ఎంపీ జ్యోతిర్మయి మహతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nobel Prize: బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత, నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్‌కి ఇచ్చిన అవార్డుని సమీక్షించాలని కోరుతూ.. బెంగాల్ బీజేపీ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహతో శుక్రవారం నార్వేజియన్ నోబెల్ కమిటీకి లేఖ రాశారు. ఆయన హయాంలో బంగ్లాదేశ్ హిందువుల, ఇతర మైనారిటీలపై జరుగుతున్న తీవ్ర అఘాయిత్యాలు, అకృత్యాలను పరిష్కరించాలని మహతో తన లేఖలో నోబెల్ కమిటీని కోరారు.
Read Also: Bangladesh: హిందువులపై ఆగని దాడులు.. మైనారిటీ హక్కుల సంఘం ఆందోళన..
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
‘‘ హిందువులు, అన్యాయానికి గురైన వ్యక్తుల గురించి ప్రస్తావిస్తూ భారతమైన హృదయంతో నేను మీకు ఈ లేఖను రాస్తున్నాను. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రస్తుతం పాలనలో మైనారిటీలు అన్యాయానికి గురవుతున్నారు. మైక్రోఫైనాన్స్‌పై అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన డా. యూనస్ పాలనలో మానవాళికి వ్యతిరేకంగా క్రూరమైన నేరాలు జరుగుతున్నాయి. అతని పాలనలో హిందూ సమాజం భయానక పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. సామూహిక హత్యలు, టార్గెటెడ్ దాడులు జరుగుతున్నాయి. అత్యాచారాలు, మతపరమైన అణిచివేత, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, దుర్గాపూజ పండగలకు అంతరాయం ఏర్పడింది’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ సామూహిక హత్యల వెనక సూత్రధారి మహ్మద్ యూనస్ అని లేఖలో ఆరోపించారు. నోబెల్ శాంతి బహుమతి శాంతి, న్యాయానికి విరుద్ధంగా ఉన్న వ్యక్తులకు ప్రదానం చేసినప్పుడు, దాని నైతికతను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఒకప్పుడు సంఘ సంస్కర్తగా కీర్తించిబడిని మహ్మద్ యూనస్ ‘‘హిందువుల కసాయి’’గా మారాడని, మైనారిటీలను రక్షించడంలో విఫలమయ్యారని, ఇలాంటి చర్యల్ని ప్రేరేపించే వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతిని సమర్థించడం విరుద్ధమని మహతో తన లేఖలో పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!