Undivided India: భారత వాతావరణ శాఖ(IMD) నిర్వహించే ‘‘అన్ డివైడెడ్ ఇండియా’’ కార్యక్రమానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను భారత్ ఆహ్వానించింది. భారత వాతావరణ శాఖ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించబడుతున్న సెమినార్లో పాల్గొనాలని పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు ఇతర పొరుగు దేశాలను ఆహ్వానించింది.
Bangladesh: ఎప్పుడైతే బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఆగస్టు 05న భారత్ పారిపోయి వచ్చిందో అప్పటి నుంచి ఆ దేశం క్రమంగా పాకిస్తాన్ జిరాక్స్ కాపీలా మారుతోంది. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్‌కి మించి అక్కడ ఇస్లామిక్ రాడికల్ శక్తులు ఎదుగుతున్నాయి. పాకిస్తాన్ ప్రేమికులుగా పేరున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)తో పాటు రాడికల్ ఇస్లామిక్ శక్తులైన జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా వంటి శక్తులు ఆడిండే ఆటగా అక్కడ పాలన సాగుతోంది.
బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత దేశం విడిచి భారత్‌లో నివసిస్తున్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు కష్టాలు పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ఆదేశాల మేరకు షేక్ హసీనా సహా 96 మంది పాస్‌పోర్టులను పాస్‌పోర్ట్, ఇమ్మిగ్రేషన్ విభాగం రద్దు చేసింది. గతేడాది జూలైలో జరిగిన హత్యలలో వారి ప్రమేయం ఉన్నందున చర్యలు తీసుకున్నారు. హసీనాపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ (ICT) హసీనా, పలువురు మాజీ క్యాబినెట్ మంత్రులు, సలహాదారులు,…
India-Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లా తాత్కిలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారుతున్నాయి. ఆ దేశంలో భారత వ్యతిరేకత విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా జమాతే ఇస్లామీ, అన్సరుల్ బంగ్లా వంటి మతోన్మాద సంస్థలు భారత్‌పై విషాన్ని వెళ్లగక్కుతున్నాయి.
Bangladeshi Singer షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా వంటి మతోన్మాద ఉగ్ర సంస్థలు మైనారిటీలు ముఖ్యంగా హిందువులపై దాడులకు తెగబడుతున్నాయి.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాక్యలు చేశారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు బీఎస్ఎఫ్ బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను అనుమతిస్తుందని గురువారం ఆరోపించారు. ఈ ఆరోపణలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. ఈ ప్లాన్ కేంద్రం యొక్క ‘‘నీచమైన బ్లూ ప్రింట్’’ అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న బీఎస్ఎఫ్ బెంగాల్లోకి చొరబాట్లను అనుమతిస్తోందని, మహిళలను హింసిస్తోందని ఆరోపించారు. ‘‘బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు’’ బెంగాల్లో శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని కొన్ని రోజుల క్రితం కేంద్ర…
Chinmoy Krishna Das: బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవపరిచినందుకు గాను 2024 నవంబర్ 25వ తేదీన హిందూ ప్రచారకర్త, ఇస్కాన్ మాజీ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్ కోర్టు ఈరోజు (జనవరి 2) తిరస్కరించింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత, భారత్-బంగ్లాల మధ్య సంబంధాలు మునుపటిలా లేవు. ఆ దేశంలో ఇస్లామిక్ రాడికల్ భావజాలం, హిందువులపై దాడులు, భారత్ వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. దీనికి తోడు బంగ్లాదేశ్ ఇటీవల కాలంలో పాకిస్తాన్‌తో సంబంధాలను పెంచుకుంటోంది. ఈ పరిణామాలు భారత్‌కి ఆందోళనకరంగా మారాయి.
Bangladesh: పాకిస్తాన్ సైన్యం అరాచకాల నుంచి రక్షించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిన భారత్ ఇప్పుడు, ఆ దేశానికి శత్రువుగా మారింది. అనేక అరాచకాలు చేసిన పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్‌కి స్నేహితుడయ్యాడు. ఎప్పుడైతే షేక్ హసీనా పదవీ నుంచి దించేసి, మహ్మద్ యూనస్ అధికారం చేపట్టాడో అప్పటి నుంచి బంగ్లా వ్యాప్తంగా భారత వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. హిందువులపై అరాచకాలు చేస్తూ, మరో పాకిస్తాన్‌గా మారేందుకు బంగ్లాదేశ్ సిద్ధమవుతోంది.