India Bangladesh: బంగ్లాదేశ్లో కీలక రైలు ప్రాజెక్ట్ నిలిపేసిన భారత్..
- మహ్మద్ యూనస్‌కి భారత్ షాక్..
- బంగ్లాదేశ్‌లో కీలక రైలు ప్రాజెక్టుల నిలిపివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Bangladesh: బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ సర్కార్‌కి భారత్ షాక్ ఇచ్చింది. ఆ దేశంలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టును నిలిపేసింది. రాజకీయ గందరగోళం, కార్మికుల భద్రత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలో స్థిరత్వం, వ్యూహాత్మక భద్రతను నిర్ధారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా, షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగిన తర్వాత, యూనస్ పాలనలో హిందూ మైనారిటీలపై దాడులు ఎక్కువ అయ్యాయి, దీనికి తోడు బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేకతను పెంచిపోషిస్తున్నారు. పాకిస్తాన్, చైనాలో బంగ్లాదేశ్ సంబంధాలు పెంచుకుంటోంది.
Read Also: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడి.. టూరిస్టులపై కాల్పులు..
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
ఇప్పటికే నిర్మాణంలో ఉన్న అఖౌరా-అగర్తల రైలు లింక్, ఖుల్నా-మోంగ్లా రైలు లింక్ వంటి ప్రధాన ప్రాజెక్టులు ఈ నిర్ణయం వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇవే కాకుండా, ఢాకా-టోంగి-జోయ్దేబ్‌పూర్ రైలు విస్తరణ ప్రాజెక్టుపై ఈ ఎఫెక్ట్ ఉండబోతోంది. ఈ ప్రాజెక్టులకు దాదాపుగా రూ. 5000 కోట్లు ఖర్చు అవుతుందని అంచానా. వీటిలో పాటు మరో 5 ప్రాజెక్టులు కూడా నిలిపిపేసినట్లు సమాచారం.
ఇటీవల, యూనస్ చైనా పర్యటనకు వెళ్లి, భారతదేశంలోని అంతర్భాగమైన ఈశాన్య రాష్ట్రాల గురించి వ్యాఖ్యలు చేశాడు. ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్‌గా ఉన్నాయని, బంగాళాఖాతానికి మేమే(బంగ్లాదేశ్) రక్షకులమని, చైనా బంగ్లాదేశ్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ ప్రాంతం విస్తరించవచ్చని చెప్పారు. ఈ వ్యాఖ్యల తర్వాత, భారత్ బంగ్లాదేశ్‌కి కల్పిస్తున్న ‘‘ట్రాన్స్ షిప్‌మెంట్’’ని ఉపసంహరించింది. దీని ఫలితంగా బంగ్లాదేశ్ భారత రోడ్లను, రైలు కనెక్టివిటీ, పోర్టులను వాడటానికి అనుమతి ఉండదు.
ఈశాన్య రాష్ట్రాలకు, భారత్ ఇతర ప్రధాన భాగాల నుంచి ప్రస్తుతం ‘‘సిలిగురి కారిడార్’’ నుంచి మాత్రమే ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. దీని వల్ల దూరభారం పెరుగుతోంది. అయితే, బంగ్లాదేశ్ వ్యాప్తంగా వెళ్తే తక్కువ సమయంలోనే ఈశాన్య రాష్ట్రాలకు చేరుకునే వీలుంది. ఇప్పుడున్న యూనస్ ప్రభుత్వం భారత వ్యతిరేకతతో ఉంది. దీంతో ఈ ప్రాజెక్టుల్ని భారత్ నిలిపేసపింది. దీనికి ప్రత్యామ్నాయంగా నేపాల్, భూటాన్ ద్వారా రైల్వేలను అభివృద్ధి చేయడంపై భారత్ దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల సిలిగురి కారిడార్‌పై ఒత్తిడిని తగ్గించవచ్చు.
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!