Pakistan: బంగ్లాదేశ్ దారిలోనే పాకిస్తాన్ నడుస్తోంది. ఇటీవల ఇజ్రాయిల్-గాజా యుద్ధంపై నిరసనగా, పాలస్తీనాకు మద్దతుగా బంగ్లాదేశ్‌లోని ప్రధాన నగరాలు, పట్టణాలలోని కేఎఫ్‌సీ అవుట్‌లెట్స్, బాటా షోరూంలపై నిరసనకారులు దాడులు చేశారు. తాజాగా, పాకిస్తాన్‌లో కూడా కేఎఫ్‌సీ టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. కేఎఫ్‌సీ రెస్టారెంట్లపై 20 వేర్వేరు దాడులు నమోదయ్యాయి. ఒక ఉద్యోగిని కాల్చి చంపారు. ఈ దాడులకు సంబంధించి దాదాపుగా 160 మందిని అరెస్ట్ చేసినట్లు అక్కడి పోలీసులు శనివారం తెలిపారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: బెదిరింపులతో విశాఖ మేయర్ పదవి దక్కించుకున్నారు
గాజాలో యుద్ధ ప్రారంభమైనప్పటి నుంచి అమెరికాకు చెందిన ఫాస్ట్ ఫుడ్ చైన్ ఇస్లామిక్ రాడికల్స్‌కి లక్ష్యంగా మారుతోంది. గాజా యుద్ధంలో అమెరికా ఇజ్రాయిల్‌కి మద్దతు ఇస్తుందనే కారణంగా, కేఎఫ్‌సీపై దాడులకు తెగబడుతున్నారు. పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్ శివార్లలోని ఒక బ్రాంచ్‌లో ఆదివారం KFC ఉద్యోగి కాల్చి చంపబడ్డాడు. ఈ దాడులకు సంబంధించి పంజాబ్ ప్రావిన్స్‌లో 145 మందిని, దేశ రాజధాని ఇస్లామాబాద్‌తో 5 మందిని అరెస్ట్ చేసినట్లు డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ తలాల్ చౌదరి చెప్పారు. గతేడాది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఒక కేఎఫ్‌సీ రెస్టారెంట్‌ని ‘‘ఫ్రీ పాలస్తీనా’’ నినాదాలు చేస్తూ తగలబెట్టారు.