Ind vs Ban : ఆసియా కప్‌లో భారత్ ఫైనల్ బరిలోకి అడుగుపెట్టింది. బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఇచ్చిన 169 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బంగ్లాదేశ్ జట్టు 19.2 ఓవర్లలోనే 128 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ సైఫ్ హసన్ ఒక్కడే ప్రతిఘటిస్తూ 69 పరుగులు సాధించాడు. అయితే మిగతా 9 మంది బ్యాటర్లు రెండంకెల…
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో.. అతను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. మార్చి 24న ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2025లో ఆడుతుండగా 36 ఏళ్ల ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. 6వ మ్యాచ్ బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ మధ్య జరిగింది. రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని 23 బంతులు ఉండగానే గెలిచింది. 46.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో గెలిచింది. 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది.
ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) ఫిక్సింగ్ కలకలం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కుదిపేసింది. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించగా.. స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని బీసీబీ (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు) చూస్తోంది.
Shakibal Hasan: బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఈ మధ్య కాలంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్ 2024లో ఇంగ్లండ్‌లో జరిగిన కౌంటీ మ్యాచ్‌లో షకీబ్ బౌలింగ్ యాక్షన్ చట్టవిరుద్ధంగా ఉన్నట్లు ఫిర్యాదు అందింది. ఈ ఘటన తరువాత ఆయనపై నిషేధం విధించబడింది. బౌలింగ్ యాక్షన్ టెస్టుల్లో ఇప్పటికే రెండుసార్లు విఫలమైన షకీబ్‌కి ఇది పెద్ద దెబ్బగా మారింది. దీనితో, బంగ్లాదేశ్ జట్టులో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేకపోయాడు. ఇది ఇలా ఉండగా..…
Tamim Iqbal Retirement: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి బంగాళాదేశ్ సీనియర్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ పునరాగమనం చేయగలడని గత కొన్ని రోజుల ముందు ఊహాగానాలు ఉండేవి. అయితే, ఈ వెటరన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావడం లేదని ప్రకటించడం ద్వారా అన్ని చర్చలకు ముగింపు పలికాడు. సోషల్ మీడియా పోస్ట్‌లో, అతను తన అంతర్జాతీయ కెరీర్‌కు అధికారికంగా వీడ్కోలు చెప్పాడు. బంగ్లాదేశ్ క్రికెట్ స్టార్ తమీమ్ ఇక్బాల్ 35 ఏళ్ల…
West Indies vs Bangladesh: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. మూడో టీ20లో ఆతిథ్య జట్టును 80 పరుగుల తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. ముందుగా జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తర్వాతి రెండో టీ20లో బంగ్లాదేశ్ 27 పరుగుల తేడాతో గెలిచింది. మూడో టీ20లో బంగ్లాదేశ్ వెస్టిండీస్‌కు 190 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, వెస్టిండీస్ 109 పరుగులకు మించి…
పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ చిరస్మరణీయ టెస్టు సిరీస్ విజయం అందుకుంది. పాక్‌ను దాని సొంత గడ్డపై చిత్తు చేసిన బంగ్లా.. 2-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. జింబాబ్వే, వెస్టిండీస్‌పైనే కాకుండా పాకిస్థాన్‌పైనా టెస్టు సిరీస్ గెలిచిన బంగ్లా.. తాము పసికూన కాదని మరోసారి నిరూపించుకుంది. ఒకవైపు బంగ్లాదేశ్‌లో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ.. బంగ్లా క్రికెట్ టీమ్ అపూర్వ విజయం సాధించడం గమనార్హం. ప్రస్తుతం బంగ్లాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ టెస్ట్ సిరీస్‌లో 10 వికెట్లు తీసిన…
పసికూన జట్టు అనే స్థాయి నుండి అగ్ర జట్లను సైతం ముచ్చెమటలు పట్టించే స్థాయికి ఎదిగింది బంగ్లాదేశ్ జట్టు. అలాంటి బంగ్లాదేశ్ క్రికెట్లో ఉన్నట్టుండి ఇప్పుడు ప్రకంపనలు చెలరేగాయి. ఉన్నట్టుండి ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ మోమినుల్ హక్ రాజీనామా ప్రకటించడం ఆ దేశ క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మోమినుల్ హక్ ఈ సంవత్సరంలో పేలవమైన ఫామ్ కనబర్చుతున్నాడు. తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడానికి అతను మంగళవారం టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు.…