బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో.. అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. మార్చి 24న ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2025లో ఆడుతుండగా 36 ఏళ్ల ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యాడు. సహచర ప్లేయర్స్, సిబ్బంది హుటాహుటిన అతడిని ఢాకాలోని కెపిజె ఎవర్‌కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత.. డాక్టర్లు తమీమ్‌కు ఆంజియోప్లాస్టీ నిర్వహించారు. చికిత్స అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. దీంతో.. డాక్టర్లు అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
Read Also: Shine Tom Chako : మలయాళ బాలయ్య భలే సెట్ అయ్యాడే!
డీపీఎల్ 2025లో మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌కు తమీమ్ ఇక్బాల్ నాయకత్వం వహిస్తున్నాడు. షైన్‌పుకుర్ క్రికెట్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఇక్బాల్‌కు ఛాతీలో నొప్పిరావడంతో మైదానంలోనే కుప్పకూలాడు. మైదానంలో వైద్య సహాయం అందించిన తర్వాత హెలికాఫ్టర్‌లో ఢాకాకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే హెలిప్యాడ్ వద్దకు తీసుకెళ్తున్న సమయంలో అతడికి ఛాతీలో నొప్పి ఎక్కువవడంతో.. వెంటనే ఫజిలతున్నేసా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఇక్బాల్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.
Read Also: Wife Poisons Husband: భర్తకు కాఫీలో విషం పెట్టిన భార్య.. వేరే వ్యక్తితో మాట్లాడొద్దనడమే పాపమా..?
తమీమ్ ఇక్బాల్.. ఢాకా ప్రీమియర్ లీగ్ (DPL)లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఏడు మ్యాచ్‌ల్లో 73.60 సగటుతో 368 పరుగులు, 102.50 స్ట్రైక్ రేట్‌తో రెండు సెంచరీలు సాధించాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో తమీమ్ 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రెండవసారి అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.