NZ vs BAN: బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ విజయం.. టోర్నీ నుంచి పాక్ ఔట్
- బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ విజయం
- టోర్నీ నుంచి పాక్, బంగ్లాదేశ్ ఔట్
- సెమీస్‌కు భారత్, కివీస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. 6వ మ్యాచ్ బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ మధ్య జరిగింది. రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని 23 బంతులు ఉండగానే గెలిచింది. 46.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర (112)సెంచరీతో చెలరేగాడు. 105 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాధించాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో టామ్ లాథమ్ (55), డెవిన్ కాన్వే (30), గ్లేన్ ఫిలిప్స్ (21*), మిచెల్ బ్రేస్ వెల్ (11*) పరుగులతో పర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో టస్కిన్ అహ్మద్, నహీద్ రానా, ముస్తఫిజుర్ రహమన్, రిషాద్ హుస్సేన్ తలో వికెట్ తీశారు.
Read Also: Bandi Sanjay : మీరు విచారణ చేస్తూ… మమ్ముల్ని అరెస్ట్ చేయమంటారా?
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటింగ్‌లో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (77) ఒంటరి పోరాటం చేశాడు. ఆ తర్వాత జాకీర్ అలీ (45) పర్వాలేదనిపించాడు. రిషాద్ హుస్సేన్ (26), తంజీద్ హసన్ (24), మెహిదీ హసన్ మిరాజ్ (13) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలింగ్‌లో మిచెల్ బ్రేస్ వెల్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత విల్ ఓ’రూర్కే రెండు వికెట్లు తీశాడు. హెన్రీ, జేమీసన్ తలో వికెట్ సంపాదించారు. కాగా.. ఈ న్యూజిలాండ్ విజయంతో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచింది. బంగ్లాదేశ్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది. దీంతో.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. భారత్, న్యూజిలాండ్ సెమీస్‌కు వెళ్లాయి.
Read Also: Minister Narayana: 2027లో ఏపీలో గోదావరి పుష్కరాలు.. కుంభమేళా ఏర్పాట్లపై ఆరా తీసిన మంత్రి బృందం
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి