బండి సంజయ్ అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర పథాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, శివ ప్రకాశ్ లు హాజరయ్యారు. ఈ సమావేశంలో బూత్ సశక్తి కరణ్ అభియాన్, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, బీజేపీ ఆవిర్భావ దినం, నిరుద్యోగ మార్చ్, భవిష్యత్ కార్యక్రమాల పై చర్చ నిర్వహించారు. అంతేకాకుండా.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఏవీఎన్ రెడ్డిని సన్మానించారు. రాష్ట్ర పదాధికారులను ఉధ్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు బండి సంజయ్ కుమార్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూత్ సశక్తీకరణ్ అభియాన్ కార్యక్రమాల కొనసాగింపు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల ఫలితాలను వివరించారు. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 100 కేంద్రాల్లో పెద్ద ఎత్తున మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ నేతలకు ఆదేశించారు. టీఎస్పీఎస్సీ లీకేజీపై బీజేపీ చేస్తున్న పోరాటాలను సైతం బండి సంజయ్ ప్రస్తావించారు. పేపర్ లీకేజీకి బాధ్యుడైన కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా పోరాడతామని బండి సంజయ్ ఉద్ఘాటించారు. లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.
Also Read : Bittergourd Juice: రోజుకో గ్లాస్ పట్టిస్తే చాలు.. పొట్ట సమస్యలే ఉండవు