Bandi Sanjay : బీజేపీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే యూపీఎస్సీ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, లీకేజీకి ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వేలాది మందితో ఈనెల 11న సంగారెడ్డిలో ‘‘నిరుద్యోగ మార్చ్’’ నిర్వహిస్తున్నట్లు, నిరుద్యోగులంతా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. అంతేకాకుండా.. ‘ టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణ జరిపించాలని, బాధ్యుడైన ఐటీ శాఖ మంత్రిని కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని, పరీక్షల రద్దుతో నష్టపోయిన ప్రతీ నిరుద్యోగికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భ్రుతి ఇవ్వాలనే డిమాండ్ తో ఈనెల 11న ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రంలోని సంగారెడ్డిలో ‘‘నిరుద్యోగ మార్చ్’’ నిర్వహించబోతున్నాం. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ‘‘నిరుద్యోగ మార్చ్’’కు నిరుద్యోగులు, ప్రజాస్వామికవాదులంతా భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నా.
Also Read : Chiranjeevi : ఏంటీ .. ఇంకో రీమేకా.. అన్నా నీకు దండం పెడతామే..?
Also Read
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
- Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
- IAS Officer Vikas Marmath: పబ్లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ పేరుతో లక్షలాది మంది నిరుద్యోగులను దారణంగా మోసం చేసిన తీరును ఈ ‘‘నిరుద్యోగ మార్చ్’’ ద్వారా ప్రజల్లో ఎండగడతాం. నిరుద్యోగ భృతి ఇస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడతాం. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ కుమారుడు మంత్రి పదవికి రాజీనామా చేసేదాకా ఆందోళనలను ఉధ్రుతం చేస్తాం. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేదాకా, పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులందరికీ రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా నిరుద్యోగుల పక్షాన పోరాడతాం. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ అనంతరం వచ్చే నెలలో హైదరాబాద్ లో ‘‘మిలియన్ మార్చ్’’ నిర్వహించి ప్రభుత్వానికి కళ్లు తెరిపిస్తాం.
Also Read :SRH vs RR: పోరాడుతోన్న సన్‌రైజర్స్.. లక్ష్యాన్ని ఛేధించగలరా?
అదే సమయంలో రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ బీజేపీ పక్షాన హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తాం. యూపీఎస్సీ తరహాలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తాం. లీకేజీకి ఆస్కారం లేకుండా పకడ్బందీగా పోటీ పరీక్షలను నిర్వహిస్తాం. బీజేపీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. యూపీఎస్సీ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. లీకేజీకి ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహిస్తాం. వేలాది మందితో ఈనెల 11న సంగారెడ్డిలో ‘‘నిరుద్యోగ మార్చ్’’. నిరుద్యోగులంతా తరలివచ్చి విజయవంతం చేయండి.’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
IAS Officer Vikas Marmath: పబ్లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!