భజరంగదళ్ ను నిషేధించడమంటే హనుమంతుడిని చెరసాలలో బంధించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనను నిరసిస్తూ రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ఎదుట ప్రజాస్వామ్యబద్దంగా ‘‘హనుమాన్ చాలీసా’’ పఠనం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కొద్దిసేపటి క్రితం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జ్ లు, వివిధ మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతేకాకుండా.. ‘ కర్నాటకలో అధికారంలోకి వస్తే పీఎఫ్ఐపై నిషేధం ఎత్తేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ భజరంగ దళ్ ను నిషేధిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం దుర్మార్గం. ఈ విషయంపై దేశవ్యాప్తంగా హిందూ సమాజం ఆగ్రహంతో ఉంది. కాంగ్రెస్ పార్టీ హిందూ ద్రోహి. హిందూ ధర్మానికి ఆపదొస్తే ముందుండి పోరాడే సంస్థ భజరంగ్ దళ్. గోరక్షణ కోసం నిరంతరం క్రుషి చేస్తున్న సంస్థ భజరంగదళ్ ను నిషేధించాలనుకోవడం దుర్మార్గం.
Also Read : Jabardasth Mahesh: ప్రభాస్ కామెడీ.. చెప్తే చెప్పావ్ కానీ బాసూ.. కడుపు నిండిపోయింది
ఇప్పుడు అడ్డుకోకపోతే తెలంగాణలో కూడా భజరంగ్ దళ్ ను నిషేధించే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ఎదుట, కాంగ్రెస్ నేతల ఇళ్ల నేతల ఎదుట హనుమాన్ చాలీసా పఠనం చేయడం ద్వారా శాంతియుత నిరసన తెలపాలి. అందులో భాగంగా ప్రతి కార్యకర్త కాషాయ కండువా ధరించి నిరసన తెలపాలి. పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడే హనుమాన్ చాలీసా పఠిస్తూ నిరసన తెలపాలి. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త, మోర్చా కార్యకర్తల కాషాయ జెండా, కండువాలు ధరించి హనుమాన్ చాలీసా పారాయణం ద్వారా నిరసన తెలపాలి.’ అని ఆయన అన్నారు.
Also Read : Viral Video : పాపం బిర్యానీ తక్కువ పెట్టారు కాబోలు.. గిన్నెనే లేపుకెళ్లారు