ఆ ముగ్గురు బీజేపీ నేతలు ఈ మధ్య ఎక్కువగా కనిపించడం లేదు. అంతా ఒకే సామాజికవర్గం నేతలు కావడంతో పార్టీలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయట. ఒకవైపు బీజేపీ దూకుడుగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. పత్తా లేకుండా పోయిన వారి గురించి నిఘావర్గాలు ఆరా తీశాయట. ఇంతకీ ఎవరా నాయకులు? పార్టీ ఆఫీస్‌కూ రావడం లేదని ఆరా..?తెలంగాణలో బీజేపీ నాయకులు వరసగా ఆందోళనలు నిర్వహిస్తూ రోడ్లపైనే ఉంటున్నారు. జాగరణ దీక్ష చేపట్టిన పార్టీ చీఫ్ బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడంతో…
నిన్న వరంగల్‌లో బీజేపీ శ్రేణులు వచ్చి అధికార టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్ నాయకులు కౌంటర్ ఇచ్చారు. సోమవారం మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపీ దయాకర్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. వరంగల్‌లో సభ పెట్టే అర్హత బీజేపీకి లేదని, మేడారం జాతరకు జాతీయ హోదా తీసుకురాలేని చవటలు బీజేపీ…
రెండు ఏళ్ల తర్వాత మీరు కోరుకున్న బీజేపీ ప్రభుత్వం వస్తే జీవో 317 లో బొంద పెడతాం అని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగులకు మద్దతుగా వరంగల్ సభలో బండి సంజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్‌ను అరెస్టు చేస్తే బీజేపీ కార్యకర్తలు భయపడిపోతారని ముఖ్యమంత్రి అనుకున్నారని, కానీ బీజేపీ కార్యకర్తలు భయపడరని బండి సంజయ్ అన్నారు. మాకు జైలు కొత్త కాదు ఇప్పటికి ఎనిమిది సార్లు వెళ్లాం. రాష్ట్ర…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. సుమారు 15 నిమిషాలపాటు ప్రధాని మాట్లాడారు. జీవో 317 సవరించాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని ప్రధాని మోడి అభినందించారు. జనవరి 2 న జాగరణ దీక్ష సందర్భంగా బండి సంజయ్ అరెస్టుకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకొని రాష్ట్రప్రభుత్వం ఎందుకు అలా చేసిందని ఆరా తీశారు ప్రధాని మోడీ. తెలంగాణలో బీజేపీకి…
317 జీవోను సవరించేదాకా తెగించి కొట్లాడతాం.. కేసీఆర్.. మీరు చేయకపోతే అధికారంలోకి వచ్చాక తొలిరోజే జీవోను సవరిస్తాం.. టీచర్లూ….ఆత్మహత్యలొద్దు మీ వెంట మేమున్నాం.. అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. సంజయ్‌ను కలిసి 317 జీవోవల్ల ఎదురవుతున్న ఇబ్బందులు టీచర్లు వివరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న 317 జీవోను సవరించేదాకా తెగించి కొట్లాడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్…
ప్రధాని కాన్వాయ్ ను అడ్డుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకునేలా రాష్ట్రపతికి నివేదించండి అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిసి వినతి పత్రం అందజేసింది బీజేపీ ప్రతినిధి బృందం. ఈనెల 5న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ప్రధానమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరపడంతోపాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖకు నివేదించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గవర్నర్…
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కినట్లు కనిపిస్తున్నాయి. ఇటీవల కరీంనగర్‌లో బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడంతో జాతీయ స్థాయి నేతలు తెలంగాణకు తరలివచ్చారు. అంతేకాకుండా నేడు బండి సంజయ్‌కి ఏకంగా ప్రధాని మోడీ ఫోన్ చేసి దాడి, అరెస్ట్‌లపై ఆరా తీశారు. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతోందనే భావన కూడా తెలంగాణ ప్రజల్లో బలపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం…
దీక్షకు దిగిన సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత జేపీ నడ్డా రావడం .. బండి విడుదల అన్ని చకచక జరిగిపోయాయి. ఇప్పుడు తెలంగాణలో రాజకీయం బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్‌గా మారింది. గత కొన్ని రోజులుగా ఇదే విషయంపై రెండు పార్టీలు ఒకరిపై ఒకరూ ఆరోపణలు, ప్రత్యాఆరోపణలు చేసుకుంటూ తెలంగాణ రాజకీయాన్ని రణరంగంగా మార్చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ స్వాగత సభ అనంతరం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్‌పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణకు విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దమ్మున్నోడు అనుకున్నా.. కానీ ఇంత పిరికివాడు అని అనుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని జైల్లో పెట్టాడంటే ఎంత భయపడ్డాడో అర్థం అవుతోందని, కృష్ణుడు కూడా జైల్లోనే పుట్టాడు.. కానీ కంసుడిని ఏం చేశారు..…
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. దీక్షకు దిగిన సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత జైలుకు వెళ్లిన ఆయన.. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి ఇవాళ తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.. ఈ సందర్భంగా స్వాగత సభ ఏర్పాటు చేసింది రాష్ట్ర నాయకత్వం.. ఈ సభలో సంజయ్ మాట్లాడుతూ.. మరోసారి ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను టార్గెట్…