రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ నాస్తికుల రాజ్యాంగ మారిపోయిందన్నారు. సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం 400 కోట్లు కేటాయిస్తా అన్నాడు…ఊహ చిత్రాలు మాత్రమే చూపించాడని ఎద్దేవా చేశారు. మేడారం జాతర కంటే ముందుగా రాజన్నను దర్శించుకోవడం…
బీజేపీ పై మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని, అధికారులను బ్లాక్ మెయిలింగ్ చేస్తుందని ఆయన ఉద్ఘాటించారు. రాష్ట్రాలకు ఉన్న అధికారాన్ని మొత్తం లాగేసుకునే కుట్ర బీజేపీ చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంతటి నియంత పాలనను….ఎప్పుడూ చూడలేదని, బీజేపీ వైఖరి మారక…
బండి సంజయ్ చేసిన 317 జీవోను రద్దు చేయాలని చేసిన ఉద్యోగ దీక్షలో పోలీసులు బండి సంజయ్‌ని అరెస్టు చేసిన సంగతి తెల్సిందే.. దీనిపై బండి సంజయ్ ప్రవిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయడంతో తెలంగాణ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సంబంధిత పోలీసు అధికారులకు ప్రివిలేజ్ కమిటీ సమన్లు జారీ చేసింది. .బండి సంజయ్ కుమార్ పై పోలీసుల దాడిని తీవ్రంగా పరిగణించిన లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ…
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డితో కలిసి బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ ఈరోజు జూమ్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్.కుమార్ మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ పై మంత్రులు, టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. బీజేపీ వైపు వేలు చూపించే ముందు టీఆర్ఎస్ నేతలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళిత, గిరిజనుల బతుకులు…
ఇటీవల రాష్ట్రంలో బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు.. ఇటు రాష్ట్రం లోనే కాకుండా దేశ వ్యాప్తంగా బండి అరెస్టును వివిధ వర్గాలు ఖండించాయి. అయితే తనను అరెస్టు చేసే సమయంలో తెలంగాణ పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదని బండి సంజయ్ అరోపించారు. అంతే కాకుండా తన అరెస్టు వ్యవహారం పై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి కూడా ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేశారు.…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లిలో అయన నేడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని అదానీ, అంబానీల చేతుల్లో పెట్టిన ఘనత బీజేపీకే దక్కిందని ఆయన విమర్శించారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని ఆయన ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి దమ్ముంటే భారతదేశమంతా దళిత బంధు అమలు చేయించాలని మంత్రి సవాల్ విసిరారు. రాష్ట్రంలోని…
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి -సిద్ధిపేట (ఎన్-765 డి.జి) రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన కృషి ఫలించింది. ఈ రోడ్డు విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, సాంకేతిక పరమైన అనుమతులకు ఆమోదం తెలపడంతో పాటు రూ.578.85 కోట్లను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ఎన్ హెచ్-765 డి.జి…
బండి సంజయ్ పై మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శల దాడులకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజనులకు బీజేపీ ఏమైనా చేసిందా..? బండి సంజయ్ కి సవాల్ విసురుతున్న ..చెప్పాలంటూ డిమాండ్ చేశారు. గిరిజన రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే కేంద్రం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో గిరిజనులకు, దళితులకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు.బీజేపీ నేతలు గాలి మాటలు మాట్లాడుతున్నారు అంటూ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు.…
కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో ఉపాధ్యాయ ఉద్యోగులకు మద్దతుగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టారు. దీంతో ఆయన చేపట్టిన దీక్షలో కోవిడ్ నిబంధనలు పాటించలేదని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ ఘటన తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్ లో బండి సంజయ్ అరెస్ట్, చోటు చేసుకున్న పరిణామాల పై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ బీసీ కమిషన్ ను ఆశ్రయించింది. ఈ క్రమంలో కరీంనగర్ సీపీ సత్యనారాయణను గత…
బీజేపీ రాష్ట్ర అధినేత బండి సంజయ్ అంటే వారికి ఎంతో అభిమానం. దానిని వెరైటీగా చూపించాడు. సిద్దిపేట జిల్లా నంగునూర్ గ్రామానికి చెందిన బెదురు కూమారా స్వామి అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి వీరాభిమాని. ఆయనపై వున్న అభిమానంతో తన వ్యవసాయ క్షేత్రంలో వరి నారుతో బండి సంజయ్ అని వరి నాటారు. వరి నారు బాగా రావడంతో పేరు బాగా కనిపిస్తోంది. ఈ నారుని చూడడానికి…