ఈ నెల 2వ తేదీన కరీంనగర్‌లో బీజేపీ చీప్ బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షను భగ్నం చేసి పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బండి అరెస్ట్‌ను ఖండిస్తూ జాతీయ స్థాయి నేతలు తెలంగాణకు వచ్చారు. అయితే నిన్న బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ బీజేపీ నేతలతో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడారు. సంజయ్ అరెస్ట్ తర్వాత జాతీయ…
కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్ధిపేటలోని రంగదాంపల్లి వద్ద కార్యకర్తలను కలిసి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రముఖ్యమంత్రి నేతృత్వంలో పోలీసులు దాడి చేసిన తీరును దేశం మొత్తం చూసిందన్నారు. నీకు వత్తాసు పలికితే కేసులు లేవు.. లేదంటే కేసులు పెట్టి బెదిరిస్తావా అంటూ ఫైర్ అయ్యారు. రాష్ర్టంలో రాక్షస పాలన నడుస్తుందన్నారు. నా కార్యాలయంలో దాడులు…
తన అరెస్టుపై బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన దారుణ మారుణ కాండపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని బండి సంజయ్ అన్నారు.ఈ ఘటనను గురించి తెలసుకునేందుకు ఛత్తీస్‌ఘడ్ మాజీ సీఎం రమణ్‌సింగ్ ఇక్కడకు వచ్చారన్నారు. డాక్టర్ కె.లక్ష్మణ్ ను రాత్రి 9 గంటలకు అరెస్టు చేసి తెల్లవార్లు చలిలో ఉంచడం ప్రభుత్వ మూర్ఖత్వానికి పరాకాష్ట అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో రాక్షస,…
బంగారు తెలంగాణలో రక్షకులు భక్షకులుగా మారారని బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జైలులో ఉన్న మా నేత ఉన్న మా కార్యకర్తలు,నాయకులు ధైర్యంగా ఉన్నారన్నారు. ప్రజల ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న బండిసంజయ్ పై ఇతర నేతలపై దాడి చేచసి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు ఖాకీలు గులాబీ కండువా కప్పుకుని కేసీఆర్ చేతిలో బార్బీ బొమ్మలుగా మారారని విమర్శించారు. దీక్షలో పాల్గొన్న మహిళలను కించపర్చారు. బట్టలు జారుతున్న…
జీవో 317 పై అలుపెరుగని పోరాటం చేస్తామంటోంది బీజేపీ. ఉద్యోగ,ఉపాధ్యాయుల కోసం బీజేపీ చేపట్టిన ఉద్యమం ముగియలేదని, బండి సంజయ్ ని రాజకీయంగా అణిచివేయాలని కేసీఆర్ కుట్రతో అరెస్ట్ చేశారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, అరెస్ట్ చేయడం తప్పు అని హైకోర్టు చెప్పింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు అంతా సిద్ధంగా ఉంటాం అన్నారాయన. రేపు ఛత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి రమన్ సింగ్, తరుణ్ చుగ్, లక్ష్మణ్,డీకే అరుణ…
జైలు నుంచి విడుదలయిన తరువాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శులు చేశారు. ఈ మాకు జైళ్లు కొత్తకాదు 9సార్లు జైలుకి వెళ్లాను. నేను ఉపాధ్యాయులు, ఉద్యోగుల కోసం జైలుకు వెళ్లాను. 317 జీవోను మాత్రం సవరించాలని మళ్లీ డిమాండ్ చేస్తున్నా అని బండి సంజయ్ అన్నారు. నీ సంగతెంటో తెలుస్తా.. ఉపాధ్యాయులు అందరితో చర్చించు వాళ్ళకి న్యాయం చేయ్ అంటూ కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్…
రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా రాజకీయం వేడెక్కింది. బండి సంజయ్ అరెస్ట్, నడ్డా క్యాండిల్ ర్యాలీ, టీఆర్ఎస్ నేతల కౌంటర్లు, మంత్రి కేటీఆర్ విమర్శలతో తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. తాజాగా తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 10న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది బీజేపీ. అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా నిరసనగా బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రధానంగా 317 జీవోను సమీక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. దీంతో పాటు బీజేపీ నేతలపై ముఖ్యంగా…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో నేడు బీజేపీ శ్రేణులు ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో పాల్గొనడానికి ఢిల్లీ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే జేపీ నడ్డాను అడ్డుకునేందుకు అప్పటికే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న పోలీసులు తెలంగాణలోని కోవిడ్ నిబంధనల గురించి వివరించారు. దీంతో ఆయన కోవిడ్ నిబంధనల ప్రకారమే నిరసన తెలియజేస్తానన్నారు. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్…
బండి సంజయ్ అరెస్టుపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఇవాళ సంజయ్ అరెస్టుకు నిరసనగా ర్యాలీ చేపట్టేందుకు ఢిల్లీ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా సైతం వచ్చారు. ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు ఈ అంశంపై కేసీఆర్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. Read Also:చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉరుకోం: మంత్రి అప్పలరాజు తెలంగాణ బీజేపీ…
బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌ను కరీంనగర్ స్థానిక కోర్టు తిరస్కరించడంతో.. ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిందే సంగతి తెల్సిందే.. బెయిల్ ఇప్పించాలని.. తనపై పెట్టిన కేసులను కొట్టి వేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్.. ఎమ్మెల్యే, ఎంపీలకు సంబంధించిన కేసుల విచారణకు తనకు రోస్టర్ లేదని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల సంబంధించిన కేసులు విచారణ జరిపే కోర్టుకు వెళ్ళాలని బండి సంజయ్ తరపు న్యాయవాదికి సూచించారు. ఈ పిటిషన్‌ను…