ప్రధాని కాన్వాయ్ అడ్డుకున్న ఘటనపై టీబీజేపీ ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని కాన్వాయ్ ను అడ్డుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకునేలా రాష్ట్రపతికి నివేదించండి అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిసి వినతి పత్రం అందజేసింది బీజేపీ ప్రతినిధి బృందం. ఈనెల 5న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ప్రధానమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరపడంతోపాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖకు నివేదించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ను కోరారు. ఈ మేరకు బండి సంజయ్ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రతినిధులు గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.
రూ.42,500 కోట్ల అంచనా వ్యయంతో పంజాబ్ లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి వెళుతుండగా నిరసన పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడం గర్హనీయమని అందులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఇది సాధ్యం కాదని, నీచమైన ఈ చర్యకు సూత్రధారి కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికైనా దిగజారుతోందనడానికి ఇదే నిదర్శనమన్నారు.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
ప్రధానమంత్రిని రాజకీయాలలోకి లాగడం, కించపరిచే ప్రయత్నం చేయడమంటే 140 కోట్ల మంది భారతీయులను అవమానించినట్లేనని పేర్కొన్నారు. అభివృద్ధిలో ప్రధాని నరేంద్రద మోదీతో పోటీ పడలేక ఎన్నికల బరిలోకి దిగలేక కాంగ్రెస్ ఇలాంటి నీచమైన చర్యకు ఒడిగట్టిందని తెలిపారు. కాంగ్రెస్ డీఎన్ఏ లోనే ఇలాంటి అవలక్షణాలన్నీ ఉన్నాయని తెలిపారు. ప్రధానమంత్రి రోడ్డపై ప్రయాణించబోతున్నారని ఫిరోజ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ నిరసనకారులకు ముందుగానే తెలియజేసినట్లు కథనాలు వచ్చాయని, అత్యంత సున్నితమైన ఈ అంశం గురించి నిరసనకారులకు సంబంధిత ఎస్పీ సమాచారం ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
యావత్ దేశం ఈ సంఘటన పట్ల విస్మయం వ్యక్తం చేస్తోందని, ప్రధానమంత్రి భద్రత గురించి సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. రాష్ట్రపతి వద్ద ప్రధాని సైతం ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాని భద్రత విషయంలో పంజాబ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును బీజేపీ తెలంగాణ శాఖ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఈ అంశంపట్ల తెలంగాణ ప్రజలు సైతం తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపడంతోపాటు బాధ్యులైన వారందరినీ చట్టపరమైన చర్యలు తీసుకునేలా రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలియజేయవలసిందిగా గవర్నర్ కు విజ్ఝప్తి చేశారు.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!