ఆత్మహత్యలొద్దు.. మీ వెంట మేమున్నాం : బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
317 జీవోను సవరించేదాకా తెగించి కొట్లాడతాం.. కేసీఆర్.. మీరు చేయకపోతే అధికారంలోకి వచ్చాక తొలిరోజే జీవోను సవరిస్తాం.. టీచర్లూ….ఆత్మహత్యలొద్దు మీ వెంట మేమున్నాం.. అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. సంజయ్‌ను కలిసి 317 జీవోవల్ల ఎదురవుతున్న ఇబ్బందులు టీచర్లు వివరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న 317 జీవోను సవరించేదాకా తెగించి కొట్లాడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పునరుద్ఘాటించారు. ఈ విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారికి అండగా బీజేపీ ఉందని భరోసా ఇచ్చారు. ‘‘మీ ఆందోళనకు దిగొచ్చి 317 జీవోను ముఖ్యమంత్రి కేసీఆర్ సవరిస్తే సరేసరి… లేనిపక్షంలో 2023లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చాక తొలిరోజే 317 జీవోను సవరించే ఉత్తర్వులపై ఎవరు సీఎం అయినా సరే…వారితో సంతకం పెట్టించే బాధ్యత నేను తీసుకుంటా’’అని హామీ ఇచ్చారు.
Also Read
తాజావార్తలు
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!