ఉదయం నుంచి ఎంతో హీట్ పుట్టించిన బీజేపీ ర్యాలీ కార్యక్రమం ముగిసింది. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో జాయింట్ సీపీ కార్తికేయకు చెప్పిన విధంగానే తాను కోవిడ్ నిబంధనల ప్రకారం నిరసన తెలియజేశారు. అయితే మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు చేరకున్న జేపీ నడ్డా నివాళులు అర్పించి బీజేపీ నిరసన కార్యక్రమాన్ని ముగించారు. అయితే ఉదయం నుంచి బీజేపీ…
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు కోవిడ్ నిబంధనలు, మరోవైపు బీజేపీ క్యాండిల్ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో బీజేపీ ర్యాలీకి అనుమతిలేదని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో మౌనంగా ర్యాలీ తీస్తామని బీజేపీ శ్రేణులు ప్రకటించాయి. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు ర్యాలీ చేపడతామని బీజేపీ తెలిపింది. దీంతో సికింద్రాబాద్ లో భారీగా పోలీసులు మోహరించారు.
గత రెండు రోజులుగా తెలంగాణలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, జీవో 317లో సవరణల కోసం బీజేపీ చీఫ్ బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టారు. దీంతో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా మరుసటి రోజు కోర్టులో హజరుపరిచారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు సికింద్రబాద్‌లో…
ఈ నెల 2వ తేదీన కరీంనగర్‌లో బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ.. బీజేపీ శ్రేణులు నేడు సాయంత్రం సికింద్రాబాద్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. ముందుగా నిర్ణయించిన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ర్యాలీ…
కరీంనగర్లో అరెస్టై జైలులో వున్న కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పరామర్శించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బండి సంజయ్ తో పాటు ముగ్గురు కార్పొరేటర్లను జైల్లో పరామర్శించానన్నారు ఈటల. మొన్న జరిగింది అత్యంత హేయమైన చర్య. ప్రజాస్వామ్య విలువలకు పాతర పెట్టారు. ఉద్యోగులను ఎవరూ ఆదుకోవడం లేదని మధన పడుతున్నారు. ప్రజల పక్షాన నిలిచేందుకు బండి సంజయ్ జాగరణకు పిలుపునిచ్చారు. సీపీ వాటర్ క్యానన్లతో శత్రువుల మీద దాడి చేయడం…
ఈ నెల 2న కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారనికై జాగరణ దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్షకు అనుమతులు లేవని, కోవిడ్ నిబంధనలు ఉలంఘించారంటూ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి మరుసటి రోజు కరీంనగర్ ఎక్సైజ్ కోర్టులో హజరుపరిచారు. దీంతో కోర్టు బండి సంజయ్‌కి 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ సమయంలో బండి సంజయ్ తరుపు లాయర్…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిన్న కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం జాగరణ దీక్ష చేపట్టారు. అయితే కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా బండి సంజయ్ దీక్ష చేస్తున్నారంటూ పోలీసులు బండి సంజయ్ చేస్తున్న జాగరణ దీక్షను నిలిపేందుకు బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి ఈ రోజు కరీంనగర్ కోర్టులో హజరుపరిచారు. దీంతో కోర్టు ఆయనకు 14…
నిన్న కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంలో బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తానికి నాటకీయ పరిణమాల మధ్య బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు బండి సంజయ్‌ను పోలీసులు కరీంనగర్ ఎక్సైజ్ కోర్టు హజరుపరిచారు. దీంతో ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ ను…
బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం, అరెస్టులపై ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇదే అంశంపై ఇంతకముందే బీజేపీ నేతలు స్పందించారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తుందో చెప్పాలని కిషన్‌రెడ్డి అన్నారు. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.టీఆర్ఎస్ నేతల కోవిడ్ ఉల్లంఘనలు పోలీసులకు కనిపించడం లేదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనల మేరకే బండి సంజయ్ దీక్ష చేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.…
నిన్న కరీంనగర్‌లోని బీజేపీ క్యాంపు ఆఫీసులో బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ ఘటనపై స్పందిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. నిన్న రాత్రి బండి సంజయ్ అరెస్ట్ దర్మార్గమపు చర్య అని ఆయన అన్నారు. విపత్తు చట్టం విపక్షాలకే వర్తిస్తుందా.. కేసీఆర్ కుటుంబానికి వర్తించదా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా నిన్న బీజేపీ కార్యాలయంలో కట్టర్లను వినియోగించి గేట్లను…