బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. తన రెండో దశ పాదయాత్రను జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ప్రారంభించారు బండి సంజయ్.. అయితే, ఇవాళ సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు యత్నించాయి. ఇటిక్యాల మండలం వేములలో బండి సంజయ్ పాదయాత్రకు నిరసన వ్యక్తం చేశారు. ఇక, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేయడంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు రోజుల ప్రశాంతంగా కొనసాగిన యాత్రలో ఐదో రోజు…
మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులతో ఓ యువకుడు ప్రాణాలు తీసుకోవడం ఖమ్మం జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి.. దీనిపై సీరియస్‌గా స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మంత్రి పువ్వాడ, బాధ్యులైన పోలీసులు, నాయకులపై హత్య కేసు నమోదు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.. మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేయకపోవడం సిగ్గు చేటన్న ఆయన.. సీఎంవో నుండి వచ్చిన ఆదేశాలవల్లే కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు.. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తేలేదు.. నమ్మిన సిద్ధాంతం…
తెలంగాణలో వడ్ల రాజకీయం రోజుకో మలుపు తిరిగింది. చివరాఖరికి తెలంగాణ ప్రభుత్వమే వడ్లు కొనడానికి రెడీ అయింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి పాదయాత్రకు రెడీ అయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్‌లో ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జోగులాంబ తల్లి ఏమి తప్పు చేసింది… ఇక్కడ దసరా ఉత్సవాలు అధికారికంగా ఎందుకు జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కు అమ్మ వారు అంటే భయం లేదు.. మైనార్టీ లు అంటే భయం.…
కాషాయ శిబిరంలో కషాయం డోస్ ఎక్కువైందా? కమలనాథుల్లో కలహాలు పెరిగాయా? నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బయట పడుతున్నాయా? పార్టీ సారథి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయా? ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు? క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకొనే ఆ జాతీయపార్టీలో అసలేం జరుగుతోంది? కమలం శిబిరంలో ఏం జరుగుతోంది? తెలంగాణలో బీజేపీ పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్టు ఉందా? నానాటికీ పార్టీ తీసికట్టుగా మారుతోందా? బీజేపీలోని ముఖ్య నాయకులు ఒకరి…
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం తెస్తున్న పథకాలను మోడీ సర్కార్ కాపీ కొడుతోందని, దళిత బంధుని కూడా కాపీ కొడతారేమోనన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన దళిత బంధు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.5 65 ఏళ్ళలో కాని పనులు ఎన్నో ఆరు ఏళ్ళలో చేసుకున్నాం అన్నారు. రైతులకు పెట్టుబడి సాయంతో పాటు రైతు చనిపోతే వారి కుటుంబాలకు రైతు బీమా ఇస్తూ అండగా…
భారత రాజ్యాంగకర్త డా. బీఆర్ అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. బండి సంజయ్.. దేని కోసం యాత్ర చేస్తున్నారు.. పెట్రో.. డీజిల్ ధరలు పెంచినందుకా.. సంగ్రామ యాత్ర అంటూ విమర్శించారు. పేదల ఆదాయం తగ్గింది.. మోడీ ప్రభుత్వ ఆదాయం పెరిగిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పైశాచిక ఆనందం…
తెలంగాణ ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత నెలకొంది. యాసంగి ధాన్యం మేమే కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందని, బీజేపీ పోరాటం దీక్ష ఫలితంగా సీఎం దిగొచ్చి ధాన్యం కొంటామని చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. ఇది తెలంగాణ రైతుల, బీజేపీ కార్యకర్తల విజయమని ఆయన అన్నారు. కింద పొగ పెడితే తట్టుకోలేక కుర్చీ కోసం ధాన్యం కొంటామని ప్రకటించారని, వరి వేస్తే ఉరి…
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది.. ఇక, టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఈ తరుణంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి.. బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ కుక్కలు.. రైతులను వరి వేయాలని చెప్పారని గుర్తుచేసిన ఆయన.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా బూట్లు నాకి.. బండి సంజయ్..…
తెలంగాణలో పండిన ప్రతి వడ్ల గింజనూ కేంద్రం కొనుగోలు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టింది. ఇది విజయవంతం అయిందని ప్రకటించింది. ‘రైతుల పక్షాన ప్రజా ప్రతినిధుల నిరసన దీక్ష’ పేరుతో అక్కడి తెలంగాణ భవన్లో చేపట్టిన ఈ దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు 1,500 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ భారీ నిరసన దీక్షలో పాల్పంచుకున్నారు. ‘ఒకే…