ఎల్లారెడ్డి పేట పోలీస్ స్టేషన్ గొడవ ఘటనలో కరీంనగర్ జైలు నుండి 23 మంది బీజేపీ కార్యకర్తలు విడుదలయ్యారు. కరీంనగర్ లో 23 మంది కార్యకర్తలను బీజేపీ రాష్ట్ర అద్యక్ష్యుడు బండి సంజయ్ పరామర్శించి,సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలపై అక్రమంగా ప్రభుత్వం కేసులు పెట్టిందని, జైలుకి పంపిస్తే బీజేపీ కార్యకర్తలు భయపడరని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మళ్ళీ చెబుతున్న కేసీఆర్ కూడా జైలు కి వెళ్తారని, నాతో సహ ఏ బీజేపీ…
నేతలు హైదరాబాద్‌ను వదలండి… సొంత ప్రాంతాలకు వెళ్ళండి అంటూ బీజేపీ నేతలతో పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ అన్నారు. హైదరాబాద్ లో ఉండి పార్టీ పని నడిపిస్త అంటే కుదరదని, జిల్లా అధ్యక్షులు జిల్లాల్లోనే ఉండాలి… ఎవరైతే ఉండలేరో రాజీనామా చేయండని ఆయన వెల్లడించారు. పార్టీలో చేరికలు ఉంటాయి.. మేము నలుగురమే ఉంటాము అంటే నడవదన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ ని విస్తరించండని, పార్టీ అధికారంలోకి వచ్చే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆయన వ్యాఖ్యానించారు.…
తెలంగాణలో బీజేపీని మరింతగా ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ పర్యటన ఉద్దేశ్యం కూడా అదే అంటున్నారు బీజేపీ నేతలు. తన పర్యటనలో ఆయన అనేక అంశాలను పరిశీలించనున్నారు. బీజేపీ ముఖ్య నేతలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జ్ లతో సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ సంస్థాగత అంశాలు, నేతల మధ్య సమన్వయం, చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ పై చర్చించనున్నారు సంతోష్. బీజేపీ బలోపేతం పై దృష్టి…
తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ విధానాలపై సమర శంఖం పూరిస్తోంది. కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయలేకపోవడంతో వెయ్యి కోట్ల బకాయి ఉంది. నేడు రైతుల పొలాలకు కరెంట్ లేక ఎండబెడుతున్న దుర్మార్గుడు కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతానన్న ఎంఐఎం నేతలు చెప్పిండ్రు. ఇప్పుడు నేను…
దేశంలో ఇటీవల 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ తన సత్తా చాటింది. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ విముఖత ఉన్నట్లు, యోగి సర్కార్ పై అక్కడి ప్రజలకు నమ్మకం పోయినట్లు ప్రత్యర్థి పార్టీలు ఎన్ని సంకేతాలు ప్రజల్లోకి పంపినా మళ్లీ అక్కడ అధికారంలో బీజేపీనే వచ్చింది. 5 రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేసేందుకు కమలనాథులు చేసిన ప్రచారం మామూలుగా లేదు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా…
వరి యుద్ధం రసవత్తరంగా మారుతోంది. కేంద్రం తీరుపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మంత్రుల పర్యటన తర్వాత మరింత వేడెక్కాయి రాజకీయాలు. తెలంగాణ మంత్రులు ఢిల్లీ పోయి వడ్లు కొనమంటే నూకలు తినమని తెలంగాణ ప్రజలను బీజేపీ మంత్రి పీయూష్ గోయల్ ఎద్దేవా చేశారు. మనల్ని నూకలు తిను అనడం..యావత్తు తెలంగాణ ప్రజలను అవమాన పరచడమే అన్నారు మంత్రి హరీష్ రావు. ఢిల్లీ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే ధరలు తగ్గుతాయి. నూకలు తినమని అవమాన పరిచిన ఢిల్లీ ప్రభుత్వానికి…
కేసీఆర్ లొల్లి లేని దగ్గర లొల్లి చేస్తున్నాడు. బస్ ఛార్జ్ లు చెప్పకుండా పెంచారని మండిపడ్డారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కరెంట్ ఛార్జ్ లు పెంచారు… ఛార్జ్ ల పెంపు ను డైవర్ట్ చేయడానికే ఢిల్లీకి మంత్రులను పంపించారన్నారు. ఓట్లు సీట్లు కొంటున్న కేసీఆర్ … ఇతర రాష్ట్రాల నేతలకు డబ్బులిచ్చి కొంటున్న సీఎం …ధాన్యం ఎందుకు కొనడం లేదన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మంత్రులని ఢిల్లీకి కొట్లాటకు పంపించావా… సమస్య పరిష్కారం కోసం…
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర రెండో విడత ఏప్రిల్ 14 నుంచి అలంపూర్‌లోని జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభం కానుంది. బండి సంజయ్ తన మొదటి దశ యాత్రను చార్మినార్‌లోని శ్రీ భాగ్యలక్ష్మి ఆలయం నుండి ఆగస్టు 2021లో ప్రారంభించి, 36 రోజులలో హుస్నాబాద్‌లో ఎనిమిది జిల్లాల్లోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు అర డజను పార్లమెంటు నియోజకవర్గాలను కవర్ చేస్తూ ముగించారు. ఇదిలాఉండగా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని…
TRS Party Leader Nama Nageswara Rao Fired On Central Government. టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత నామానాగేశ్వర రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని 8 సంవత్సరాలుగా ప్రస్తావిస్తున్నామన్నారు. మా డిమాండ్లను కేంద్రం పెడచెవిన పెడుతోందని, “నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. మా నోటీసులను అనుమతించక పోవటంతో ఉభయ సభల నుంచి వాకౌట్ చేశామని ఆయన వెల్లడించారు. కేంద్రం తన…
ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఈమేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రధాని నరేంద్రమోదీ గారికి కేసీఆర్ రాసిన లేఖలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా అనేక అవాస్తవాలు వున్నాయన్నారు. కేసీఆర్ వి అబద్ధాలేనని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గారు ఆధారాలతో సహా తేల్చారు. వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి.. లేనిపక్షంలో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలి. పంజాబ్ సహా అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రం బియ్యం సేకరిస్తుందే…