తెలంగాణలో వడ్ల రాజకీయం రోజుకో మలుపు తిరిగింది. చివరాఖరికి తెలంగాణ ప్రభుత్వమే వడ్లు కొనడానికి రెడీ అయింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి పాదయాత్రకు రెడీ అయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్‌లో ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జోగులాంబ తల్లి ఏమి తప్పు చేసింది… ఇక్కడ దసరా ఉత్సవాలు అధికారికంగా ఎందుకు జరపడం లేదని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ కు అమ్మ వారు అంటే భయం లేదు.. మైనార్టీ లు అంటే భయం. 15 నిమిషాలు సమయం ఇస్తే చంపుతామన్న అక్బరుద్దీన్ నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ప్రభుత్వం సరైన ఆధారాలు కోర్టులో చూపించలేదు. అధికారంలోకి వస్తాం …కేసును తిరగతోడతాం. హిందూ ధర్మంలో పుట్టడం గర్వంగా ఉంది. బీజేపీ హిందువుల గురించి మాట్లాడకపోతే దేశంలో హిందువుల పరిస్థితి ఏంది?
Read Also: Vegeterian Country: భారత్ శాఖాహార దేశమా..మాంసం తినటం నేరమా?
తెలంగాణలో అయ్యప్ప మాల , హనుమాన్ మాల, శివుని మాల వేస్తే ఉద్యోగానికి రావొద్దు, స్కూల్ కి రావొద్దు… రంజాన్ కి నమాజ్ చేసుకోవడానికి మాత్రం అనుమతి ఇస్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే మాల ధారణ చేసే వారికి వెసులుబాటు ఇస్తాం. సంగ్రామ యాత్ర మొదటి విడత సందర్బంగా అధికారంలోకి వస్తే ఉచిత విద్య వైద్యం అందిస్తామని హామీ ఇచ్చాం. ముఖ్యమంత్రి మెడలు వంచి ధాన్యాన్ని కొనిపిస్తున్నాం… ఘనత బీజేపీ కార్యకర్తలదే. నష్ట పోయిన రైతులను కేసీఆర్ ఆదుకోలేదన్నారు బండి సంజయ్. అంబేద్కర్ జయంతి సందర్భంగా కేసీఆర్ బయటకు రాలేదు… ఆయనకు నివాళులు అర్పించలేదన్నారు బండి సంజయ్.