బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. కరీంనగర్‌కు వెయ్యి కోట్ల నిధులు తీసుకొచ్చి… చేతనైతే అభివృద్ధిలో పోటీపడాలన్నారు కేటీఆర్. సోమ, మంగళవారం అంటూ రాజకీయం చేయొద్దన్నారు. కేసీఆర్ లేకపోతే జన్మలో తెలంగాణ వచ్చేది కాదన్నారు. కేసీఆర్, టీఆర్‌ఎస్ లేకుంటే తెలంగాణ పదం ఉండేదా? అని ప్రశ్నించారు కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం బండలింగంపల్లి గ్రామం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో రూ.28 లక్షలతో నిర్మించనున్న ఆధునిక భవన నిర్మాణం, నూతన మౌలిక…
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి .. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌ని విశ్వేశ్వరరెడ్డి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రేపు రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. ఈ సమయంలో కొండా… సంజయ్‌ని కలవడంతో.. పార్టీలో చేరికపైనే అనే ప్రచారం జరుగుతోంది. గతంలోనూ బీజేపీ నేతలతో పలు సందర్భాల్లో సమావేశం అయ్యారు కొండా విశ్వేశ్వరరెడ్డి.. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన.. మళ్లీ హస్తం పార్టీలో…
తెలంగాణలో రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య… మాటలతూటాలు పేలుతున్నాయి. నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. గులాబీ పార్టీ బీజేపీని టార్గెట్ చేస్తూ… కేంద్ర ప్రభుత్వం, మోడీకి విజన్ లేదని విమర్శలు గుప్పిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ కూడా అధికార టీఆర్‌ఎస్‌పై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతోంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో దూసుకుపోతున్నారు. ఇదే సమయంలో అగ్రనేతలను రంగంలోకి దింపుతోంది కమలం పార్టీ. ఈనెల 5న జేపీ నడ్డా, 14న…
తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీ నేతలు.. ఆ వేడిలో చేస్తున్న ప్రకటనలు రచ్చ రచ్చ అవుతున్నాయి. కాషాయ శిబిరంలో గుబులు రేపుతున్నాయి. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగుతోంది. పాదయాత్రలో భాగంగా సభలు.. సమావేశాలు నిర్వహిస్తున్నారు నాయకులు. ఈ క్రమంలోనే మక్తల్‌లో సభ నిర్వహించారు. ఆ సభ.. సభలో చేసిన ప్రకటనలు ప్రస్తుతం బీజేపీలో చర్చగా మారాయి. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి చేసిన కామెంట్స్ చుట్టూనే ప్రస్తుతం…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రం రెండో దశ ప్రారంభించారు. అయితే ఈ పాదయాత్రలో పాల్గొనడానికి బీజేప జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 5న మహాబూబ్‌నగర్‌కు రానున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌లో ప్రజా సంగ్రామయాత్ర సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు జన సమీకరణ పై బీజేపీ దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో…
మహారాష్ట్ర రాయ్‌చూర్ నియోజకవర్గానికి చెందిన మీ బీజేపీ ఎమ్మెల్యేనే మా నియోజకవర్గాన్ని తెలంగాణ కలపంటున్నారని, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మాకు కావాలంటున్నారని టీఆర్ఎస్ నేతలు సమయం దొరికినప్పుడల్లా తెలంగాణ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా రాయ్‌చూర్ ఎమ్మెల్యే శివ్‌రాజ్ పాటిల్ ఎన్టీవీతో మాట్లాడుతూ.. నేను ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడిన మాటలను టీఆర్ఎస్ వాళ్ళు రాజకీయానికి వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా నా నియోజకవర్గంకు ఎక్కువ పనులు, నిధులు మంజూరు కోసమే…
మరోసారి బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. నిన్న టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఘనంగా జరిగాయి. ఈ ప్లీనరీ సమావేశాల్లో 13 కీలక తీర్మానాలు చేశారు. ఈ నేపథ్యంలో తాజా బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తీర్మానాలపై బీజేపీ నేతల నుంచి సమాధానం లేదని ఆయన విమర్శించారు. రిజర్వేషన్లు, నవోదయ విద్యాలయాలలతో పాటు ఏ ఒక్క అంశంపై బీజేపీ నేతల వైపు నుంచి సమాధానం…
టీఆర్ఎస్ ప్లీనరీలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేయడాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. కేవలం బీజేపీని తిట్టడానికే ఆయన టీఆర్ఎస్ ప్లీనరీని నిర్వహించారన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు కాబట్టే కేసీఆర్ బీజేపీని తిట్టడానికి ఈ సమావేశం పెట్టుకున్నారని ఆరోపించారు. సాధారణంగా ప్లీనరీలో పార్టీ వ్యవహారాలు, సంస్థాగత ఏర్పాట్లపై చర్చిస్తారని.. కానీ టీఆర్ఎస్ ప్లీనరీ దీనికి విరుద్ధంగా జరిగిందని బండి సంజయ్ విమర్శించారు. 33 రకాల…
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ధనిక రాష్ట్రం అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన సందర్భంగా ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అయితే ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పార్టీ ఆస్తులను ప్రకటించిన కేసీఆర్ తన కుటుంబం ఆస్తులను ఎందుకు ప్రకటించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రోజుకో మాట…
టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ పార్టీకి పలు ప్రశ్నలు సంధించారు. సీఎంగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ తన 8 ఏళ్ల పాలనలో ఏం ఒరగబెట్టారో మూడున్నరకోట్ల తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ 8 ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, అవినీతి, నియంతృత్వ పోకడలు, ప్రజాస్వామ్య హననం, కుటుంబపాలన వంటి అంశాలను ప్రస్తావిస్తే కేసీఆర్ అసమర్థ పాలనపై వెయ్యి ప్రశ్నలు అడిగినా సరిపోదని ఎద్దేవా చేశారు. అబద్ధాలతోనే…