కరీంనగర్ జిల్లా బీజేపీ పార్టీలో వర్గ విభేదాలు ఇప్పట్లో సమసిపోయేలా లేవు..గతంలో సైతం పలుమార్లు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఓటమికి వర్గ విబేధాలే కారణం కాగా రాబోవు ఎన్నికల్లో కూడా ఈ గొడవ తప్పదేమో అని కింది స్థాయి కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా ఎంపీ గా రాష్ట్ర అధ్యక్షుడే ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లాలో ఉన్నా అప్పుడప్పుడు అసమ్మతి రాగాలు వినబడుతూనే ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ మూడు ముక్కలాట గా మారింది. కరీంనగర్ జిల్లా…
తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్వహించిన ఉగాది వేడుకలు పెద్ద చర్చగా మారిపోయాయి.. సీఎం కేసీఆర్, మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎవ్వరూ హాజరు కాకపోవడంపై.. గవర్నర్ తమిళిసై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. కొందరు బీజేపీ నేతలు కూడా డుమ్మా కొట్టారు.. దీనిపై పీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.. అసలు రాజ్ భవన్‌లో ఉగాది వేడుకలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి…
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రంకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్కసుమన్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… కేంద్రం వరి రైతులకు ఉరి వేస్తోందని, కేంద్రం వరికి ఉరి వేస్తే వారికి ఘోరి కడుతామని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి నలుగురు ఎంపీలను గెలిపిస్తే రైతులను నట్టేట ముంచారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులకు రైతాంగంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, వాళ్లకి…
రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోందని, అయినా సీఎం కేసీఆర్ దాని గురించి పట్టించుకోవడం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలన అంతానికి… ఇదే ఆఖరి పోరాటం. ప్రజలంతా బీజేపీకి అండగా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం అన్నారు బండి సంజయ్. ఢిల్లీలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేరారు…
హైదరాబాద్లో ప్రకంపనలు సృష్టిస్తున్న రాడిసన్ పబ్ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిని అరెస్ట్ చేసే దమ్ము కేసీఆర్కు ఉందా అని ఆయన సవాల్ విసిరారు. ఈ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఆ పేర్లన్నీ తాను వెల్లడిస్తానని.. దమ్ముంటే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ డ్రగ్స్ కేసులో ఎవరైనా బీజేపీ నేతలు ఉంటే వారిని…
తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల పంజాబ్లో మాదిరిగా తెలంగాణలోనూ పూర్తిగా ధాన్యం కొనుగోళ్లు చేయాలని కోరుతూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు తెలంగాణ మంత్రులు వినతి పత్రం అందజేశారు. అయితే తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. దీంతో టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా కేంద్రంతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కిషన్…
ఎల్లారెడ్డి పేట పోలీస్ స్టేషన్ గొడవ ఘటనలో కరీంనగర్ జైలు నుండి 23 మంది బీజేపీ కార్యకర్తలు విడుదలయ్యారు. కరీంనగర్ లో 23 మంది కార్యకర్తలను బీజేపీ రాష్ట్ర అద్యక్ష్యుడు బండి సంజయ్ పరామర్శించి,సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలపై అక్రమంగా ప్రభుత్వం కేసులు పెట్టిందని, జైలుకి పంపిస్తే బీజేపీ కార్యకర్తలు భయపడరని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మళ్ళీ చెబుతున్న కేసీఆర్ కూడా జైలు కి వెళ్తారని, నాతో సహ ఏ బీజేపీ…
నేతలు హైదరాబాద్ను వదలండి… సొంత ప్రాంతాలకు వెళ్ళండి అంటూ బీజేపీ నేతలతో పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ అన్నారు. హైదరాబాద్ లో ఉండి పార్టీ పని నడిపిస్త అంటే కుదరదని, జిల్లా అధ్యక్షులు జిల్లాల్లోనే ఉండాలి… ఎవరైతే ఉండలేరో రాజీనామా చేయండని ఆయన వెల్లడించారు. పార్టీలో చేరికలు ఉంటాయి.. మేము నలుగురమే ఉంటాము అంటే నడవదన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ ని విస్తరించండని, పార్టీ అధికారంలోకి వచ్చే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆయన వ్యాఖ్యానించారు.…
తెలంగాణలో బీజేపీని మరింతగా ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ పర్యటన ఉద్దేశ్యం కూడా అదే అంటున్నారు బీజేపీ నేతలు. తన పర్యటనలో ఆయన అనేక అంశాలను పరిశీలించనున్నారు. బీజేపీ ముఖ్య నేతలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జ్ లతో సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ సంస్థాగత అంశాలు, నేతల మధ్య సమన్వయం, చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ పై చర్చించనున్నారు సంతోష్. బీజేపీ బలోపేతం పై దృష్టి…
తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ విధానాలపై సమర శంఖం పూరిస్తోంది. కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయలేకపోవడంతో వెయ్యి కోట్ల బకాయి ఉంది. నేడు రైతుల పొలాలకు కరెంట్ లేక ఎండబెడుతున్న దుర్మార్గుడు కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతానన్న ఎంఐఎం నేతలు చెప్పిండ్రు. ఇప్పుడు నేను…