మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులతో ఓ యువకుడు ప్రాణాలు తీసుకోవడం ఖమ్మం జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి.. దీనిపై సీరియస్‌గా స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మంత్రి పువ్వాడ, బాధ్యులైన పోలీసులు, నాయకులపై హత్య కేసు నమోదు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.. మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేయకపోవడం సిగ్గు చేటన్న ఆయన.. సీఎంవో నుండి వచ్చిన ఆదేశాలవల్లే కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు.. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తేలేదు.. నమ్మిన సిద్ధాంతం కోసం తెగించి కొట్లాడే కార్యకర్త సాయి గణేష్ అన్నారు. చట్టానికి లోబడి పాలకుల అక్రమాలు, దుర్మార్గాలపై న్యాయ బద్ధంగా యుద్ధం చేసిన యువకుడు గణేష్.. అలాంటి యువకుడు మన మధ్య లేకపోవడం బాధాకరం.. సాయిగణేష్ పోరాటం మరువలేనిది., టీఆర్ఎస్ నేతలు గూండాయిజానికి పోలీసుల కండకావరానికి సాయి గణేష్ బలైపోయారన్నారు.
Read Also: Honour Killing: భువనగిరిలో పురువు హత్య..
నిరుపేద సామాన్య కార్యకర్త, తల్లిని పోషిస్తూ కష్టపడి పనిచేస్తున్న యువకుడు.. సాయి గణేష్ మరో పేద అమ్మాయితో వివాహానికి నిశ్చితార్థం కూడా జరిగిందన్నారు బండి సంజయ్.. పెళ్లికి రమ్మంటూ నాకూ ఫోన్ చేసి ఆహ్వానించారు.. ఇంతలోనే ఈ దారుణం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.. టీఆర్ఎస్ నేతలు, జిల్లా మంత్రి బీజేపీని చూసి భయపడుతున్నారన్న ఆయన.. బీజేపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ బీజేపీ అధికారంలోకి వచ్చాక బాధ్యులను వదిలిపెట్టబోం కచ్చితంగా శిక్షిస్తామని హెచ్చరించారు. కాగా, జోగులాంబ గద్వాల జిల్లాలో నాల్గో రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభమైంది.. ఇవాళ జాలపూర్ శివారు నుండి వాలూర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. బోరవెల్లిలో మధ్యాహ్నభోజన విరామం ఉండగా.. చందూరు క్రాస్ రోడ్, జాలాపూర్, బోరవెల్లి, నారాయాణపూర్ మీదుగా ఇవాళ మొత్తం 13 కిలోమీటర్లు సాగనుంది పాదయాత్ర.