మరోసారి బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. నిన్న టీఆర్‌ఎస్ పార్టీ 21వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఘనంగా జరిగాయి. ఈ ప్లీనరీ సమావేశాల్లో 13 కీలక తీర్మానాలు చేశారు. ఈ నేపథ్యంలో తాజా బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తీర్మానాలపై బీజేపీ నేతల నుంచి సమాధానం లేదని ఆయన విమర్శించారు. రిజర్వేషన్లు, నవోదయ విద్యాలయాలలతో పాటు ఏ ఒక్క అంశంపై బీజేపీ నేతల వైపు నుంచి సమాధానం…
టీఆర్ఎస్ ప్లీనరీలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేయడాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. కేవలం బీజేపీని తిట్టడానికే ఆయన టీఆర్ఎస్ ప్లీనరీని నిర్వహించారన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు కాబట్టే కేసీఆర్ బీజేపీని తిట్టడానికి ఈ సమావేశం పెట్టుకున్నారని ఆరోపించారు. సాధారణంగా ప్లీనరీలో పార్టీ వ్యవహారాలు, సంస్థాగత ఏర్పాట్లపై చర్చిస్తారని.. కానీ టీఆర్ఎస్ ప్లీనరీ దీనికి విరుద్ధంగా జరిగిందని బండి సంజయ్ విమర్శించారు. 33 రకాల…
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ధనిక రాష్ట్రం అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన సందర్భంగా ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అయితే ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పార్టీ ఆస్తులను ప్రకటించిన కేసీఆర్ తన కుటుంబం ఆస్తులను ఎందుకు ప్రకటించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రోజుకో మాట…
టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ పార్టీకి పలు ప్రశ్నలు సంధించారు. సీఎంగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ తన 8 ఏళ్ల పాలనలో ఏం ఒరగబెట్టారో మూడున్నరకోట్ల తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ 8 ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, అవినీతి, నియంతృత్వ పోకడలు, ప్రజాస్వామ్య హననం, కుటుంబపాలన వంటి అంశాలను ప్రస్తావిస్తే కేసీఆర్ అసమర్థ పాలనపై వెయ్యి ప్రశ్నలు అడిగినా సరిపోదని ఎద్దేవా చేశారు. అబద్ధాలతోనే…
టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర, సభలపై రేవంత్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందేకాగా.. వాటిపై స్పందించిన డీకే అరుణ.. జోగులాంబ సాక్షిగా ప్రమాణం చేద్దామా? అమ్మవారి ఎదుట బండి సంజయ్ పై చేసిన ఆరోపణలు నిరూపిస్తావా? అని చాలెంజ్ చేశారు. పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి పిచ్చి ప్రేలాపనలు చేస్తారా? అని మండిపడ్డ ఆమె.. టీఆర్ఎస్ –…
బీజేపీ నేతలపై మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. నిన్న మొన్న రాష్ట్రంలో కొత్త బిచ్చగాళ్ళు తెలంగాణ ప్రజలపై అపారమైన ప్రేమను ఒలకబోస్తున్నారు. బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. తెలంగాణ ను మోసం చేసిన చరిత్ర బీజేపీ ది. మూడు చిన్న రాష్ట్రాలు ఇచ్చినప్పుడే తెలంగాణ ఇచ్చి ఉంటే 2000 సంవత్సరంలో ఇన్ని బలిదానాలు అయ్యేవా అన్నారు. బీజేపీ అవకాశవాద రాజకీయాల వల్లే తెలంగాణ కు చాలా నష్టం జరిగింది. తెలంగాణ…
తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం వాడివేడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి హరీష్‌రావు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. హరీష్ రావు మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి టీఆర్ఎస్ సర్కార్‌ను ఆడిపోసుకోవడం కాదు.. కేంద్రం నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన డబ్బులు ఇప్పించండని ఆయన సవాల్ విసిరారు. మూడు లక్షల కోట్లు కేంద్రం తెలంగాణకు ఎక్కడ ఇచ్చింది…? చెప్పండని ఆయన ప్రశ్నించారు. గ్రామాలకు నిధులు అంతా బీజేపీ సర్కార్ ఇస్తే.. దేశంలోని పల్లెలు…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర నేడు 9వ రోజు కొనసాగుతోంది. అయితే పాదయాత్ర వద్ద డీకే అరుణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేడు పాదయాత్ర చేపట్టడంతోనే ఆర్డీఎస్ సమస్యను పరిష్కారించిన ఘనత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి దక్కుతుందన్నారు. 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాయడం వల్లనే జరిగిందని మోసపూరిత మాట్లాడటం సరిగదాని కర్నూలు, పోలీసులతో అలంపూర్, గద్వాల రైతులు యుద్దవాతవరణం…
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నియామకమై రెండేళ్లు అవుతుంది. రాష్ట్ర కమిటీ ఏర్పడి ఒకటిన్నర సంవత్సరం పూర్తయింది. అయినప్పటికీ బీజేపీలో వివిధ స్థాయిలో పార్టీ పోస్ట్‌లు ఖాళీగానే ఉన్నాయి. వివిధ కారణాలతో వాటి భర్తీని ఆపేశారు. ఎప్పటి నుంచో పదవులు కట్టబెట్టాలని నేతలు డిమాండ్ చేస్తున్నా.. సీనియర్లు సూచిస్తున్నా.. ఖాళీగా ఎందుకు ఉంచుతున్నారనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఆ పదవుల్లో కీలకమైన అసెంబ్లీ కన్వీనర్ పోస్టులు కూడా ఉన్నాయి. ..spot.. gfx కన్వీనర్ పోస్టులపై ఉలుకు..…
ఈ దఫా తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది బీజేపీ ఆశ. దూరమైన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. రాష్ట్రంలో బలంగా ఉన్న టీఆర్ఎస్ను మరింత బలంగా ఢీకొట్టేందుకు ఈ రెండు పార్టీలు వేయని ఎత్తుగడలు లేవు. ఈ క్రమంలో బీజేపీ రణతంత్రం ఒకలా ఉంటే.. కాంగ్రెస్ పొలిటికల్ వార్ ఇంకోలా ఉంది. కాకపోతే రెండు పార్టీల మధ్య ఒక విషయంలో సారూప్యత ఉండటంతో.. ఆ విషయం తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ నాయకుల్లో టెన్షన్ పట్టుకుందట. వాటిపైనే…