రంగారెడ్డి జిల్లా తుక్కు గూడలో రేపు జరిగే అమిత్ షా సభను విజయవంతం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రేపటి బహిరంగ సభకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు బీజేపీ నేతలు. సీఎం కేసీఆర్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. కుట్రతో, కుటిల నీతితో పాలన కొనసాగిస్తున్నారు. ఈ అంశాలను ప్రజలకు వివరించేందుకు బండి సంజయ్ సంగ్రామ యాత్ర చేపట్టారన్నారు. రేపు జరిగే సభను సక్సెస్ చేసి.. కేసీఆర్ చెంప…
తెలంగాణలో మరింత విస్తరించాలని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ఢిల్లీ నాయకత్వం పదే పదే రాష్ట్ర నాయకులకు చెబుతూ వస్తోంది. ప్రజా సమస్యలు.. రాజకీయ అంశాలపై అటెన్షన్ తీసుకొస్తూనే.. క్షేత్రస్థాయిలో పార్టీ బలం పెరగడానికి వివిధ పార్టీల్లో శక్తికేంద్రాలుగా ఉన్న నాయకులకు కాషాయ కండువా కప్పాలని స్పష్టంగా సూచిస్తున్నారు. దాంతో బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. కానీ.. ఆ స్థాయిలో జాయినింగ్స్ లేవు. హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం తర్వాత వలసలు…
తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఏర్పడింది. ఒకవైపు పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్, మంత్రుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇటు టీఆర్ఎస్ మంత్రులు సైతం బీజేపీ నేతల్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీజేపీ నేతల్ని టార్గెట్ చేశారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఏమి లేని ఆకు ఎగిరి ఎగిరి పడతదంట…..అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటదంట. ఏమి లేని ఆకు లాగా…
దక్షిణాదిలో మరో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ.. తెలంగాణపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. రాష్ట్ర నాయకత్వానికి పోరాడే సమస్యలు.. క్షేత్రస్థాయిలో నిరసనలు చేపట్టే అంశాలు అప్పగిస్తూనే.. ఎన్నికల రణతంత్రం మొత్తం జాతీయ నాయకత్వమే నడిపిస్తోందట. ఈ వ్యూహంలో భాగంగానే బీజేపీ సంస్థాగత ఇంఛార్జులు తరచూ తెలంగాణకు రావడం.. పార్టీ నేతలతో సమీక్షలు చేస్తూనే ఇక్కడ పరిస్థితులను ఆకలింపు చేసుకుంటున్నారట. గ్రౌండ్ లెవల్ నుంచి అందుతున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా అప్పటికప్పుడు ప్లానింగ్ మార్చేస్తున్నట్టు సమాచారం. ఈ…
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పార్టీ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో నిర్వహించనున్నారు. అయితే..ఈ సభకు కేంద హోంశాఖ మంత్రి…
తెలంగాణ ద్రోహులు అంతా కేసీఆర్ పక్కన ఉన్నారని ఎద్దేవా చేశారు. 24వ రోజు ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆయన జడ్చర్ల నియోజకవర్గం నక్కలబండ తండాకు చేరుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జడ్చర్లలోని 600 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 1500 కోట్ల విలువైన 120 ఎకరాలను కబ్జా చేసిన ఘనులు టీఆర్ఎస్ నేతలేనని అన్నారు. టీఆర్ఎస్ నేతలు జనాన్ని దోచుకుంటున్నరని అన్నారు. చివరకు పేదల, ఆరె కటికెల భూములను కబ్జా చేస్తున్నారని ఆగ్రహం…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర రెండో దశ నేడు పాలమూరు గడ్డపై ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన డీకే అరుణ.. తెలంగాణ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ అడుగడుగునా మోసం చేశారని, ఇచ్చిన హామీల్ని ఏమాత్రం నెరవేర్చలేదని అన్నారు. ఇక్కడి ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు తాను కాపలా కుక్కలా ఉంటానని, ప్రాజెక్టుల్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి చేస్తానని మాటిచ్చాడని, కానీ ఇప్పుడా హామీల్ని తుంగలో తొక్కేశాడని…
తెలంగాణపై గురిపెట్టిన బీజేపీ.. ఇతర పార్టీల నేతలను.. బీజేపీలోకి ఆహ్వానించే పనిలోపడింది.. ఇప్పటికే చాలా మంది నేతలతో కమలం పార్టీ నేతలు టచ్లోకి వెళ్లారట.. మరికొందరు.. వారికి టచ్లోకి వస్తున్నారట.. అయితే, పార్టీలో చేరికలు, ఇప్పటికే పార్టీలో ఉన్నవారు చెప్పే అభ్యంతరాలపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీజేపీ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బూత్ స్థాయిలో పార్టీ విస్తరణకు పనిచేయాలని సూచించారు.. దళితుల బస్తీలకు వెళ్లి వాళ్ల సమస్యలు…
టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్… మహబూబ్నగర్లో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొదటి విడత పాదయాత్రతో తెలంగాణలో రాజకీయ వాతావరణం మారింది, ఇక, రెండో విడత పాదయాత్ర 5 జిల్లాల మీదుగా 348 కిలోమీటర్లు సాగుతోందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, నిరుద్యోగం, డబుల్ బెడ్ రూం ఇళ్లపై చాలా మంది ఫిర్యాదులు వచ్చాయన్నారు. పాలమూరు…
తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.. అధిష్టానం నుంచి తరచూ రాష్ట్రంలో పర్యటనలు కొనసాగిస్తున్నారు నేతలు.. ఇక, ఇవాళ పాలమూరులో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతలు సమావేశం అయ్యారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ…