Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bandi Sanjay Demands 21 Questions To Answers In Trs Plenary Meeting

Bandi Sanjay: ప్లీనరీలో ఈ 21 ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాల్సిందే..!!

Published Date :April 27, 2022 , 10:30 am
By Ramesh Nalam
Bandi Sanjay: ప్లీనరీలో ఈ 21 ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాల్సిందే..!!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ పార్టీకి పలు ప్రశ్నలు సంధించారు. సీఎంగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ తన 8 ఏళ్ల పాలనలో ఏం ఒరగబెట్టారో మూడున్నరకోట్ల తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ 8 ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, అవినీతి, నియంతృత్వ పోకడలు, ప్రజాస్వామ్య హననం, కుటుంబపాలన వంటి అంశాలను ప్రస్తావిస్తే కేసీఆర్ అసమర్థ పాలనపై వెయ్యి ప్రశ్నలు అడిగినా సరిపోదని ఎద్దేవా చేశారు. అబద్ధాలతోనే ప్రజలను మోసం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ కనీసం ఈ 21 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బండి సంజయ్ కోరారు. ఒకవేళ సమాధానాలు దాటవేస్తే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వంగా ఒప్పుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు.

బండి సంజయ్ సంధించిన 21 ప్రశ్నలు:

Also Read

  • Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
  • Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
  • TG20 Cricket: తెలంగాణ క్రికెట్‌ లీగ్‌కు బీసీసీఐ ఆమోదం..
  • Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
Add as a preferred
source on google

1) 2014లో 32 పేజీలు, 2018లో 16 పేజీల ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసి తెలంగాణ ప్రజలకు మీరు అనేక హామీలు ఇచ్చారని.. ఇందులో ఎన్ని అమలు చేశారో చర్చించడానికి కేసీఆర్ సిద్ధమేనా అని ప్రశ్నించారు. కనీసం ఈ అంశంపై శ్వేతపత్రం విడుదల చేయగలరా అని నిలదీశారు.
2) ఇంటికో ఉద్యోగం ఇస్తామని వాగ్దానం చేసిన మీరు.. మీ కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఇది వాస్తవం కాదా? దీనికి మీ సమాధానమేమిటి?
3) నిరుద్యోగ భృతి నెలకు రూ.3,016 చొప్పున ఇప్పటి వరకు తెలంగాణలో ఎంత మందికి విద్యావంతులైన యువతకు ఇచ్చారు? ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఎప్పటి నుండి ఇస్తారు?
4) బిస్వాల్‌ కమిటి నివేదిక ప్రకారం రాష్ట్రప్రభుత్వ శాఖల్లో 1 లక్షా 91 వేల ఖాళీలుండగా కేవలం 81 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామనడం నిరుద్యోగ యువతను మోసం చేయడం కాదా? మిగతా పోస్టుల భర్తీ ఎప్పుడు ప్రారంభిస్తారు?
5) పోడుభూములకు పట్టాలు ఇవ్వడం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లపై అర్డినెన్స్‌ తేవడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అలసత్వం నిజం కాదా?
6) దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇవ్వకపోవడం, దళిత బంధును విస్తరించి రాష్ట్రమంతా అమలు చేయడంలో మీ ప్రభుత్వ వైఫల్యం మీకు కనిపిస్తుందా?
7) దళితున్ని ముఖ్యమంత్రిగా ఎప్పుడు చేస్తారు? కనీసం దళితున్ని మీ పార్టీ అధ్యక్షునిగా అయినా చేస్తారా? ఎస్సీ, ఎస్టీ, సబ్‌ప్లాన్‌ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించి ఎస్సీ, ఎస్టీలను మీ ప్రభుత్వం మోసగించిన మాట వాస్తవం కాదా? 125 ఫీట్ల డా.బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఎప్పుడు ఆవిష్కరిస్తారు?
8) బీసీబంధు పథకాన్ని ఎప్పటినుంచి ప్రవేశపెడతారు? బిసి, ఎంబిసి కార్పోరేషన్లకు నిధుల కేటాయింపు, ఖర్చులపై మీరు ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందా? బీసీలకు ఇవ్వాల్సిన 3 వేల కోట్ల ఫీజురియంబర్స్‌మెంట్‌ నిధులను ఎప్పుడు మంజూరు చేస్తారు? ఆత్మగౌరవ భవనాలను ఎప్పుడు నిర్మిస్తారు?
9) ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని 2014 లో ఎన్నికల మ్యానిఫెస్టోలో పేజ్‌ నెం.7లో మీరు హామీ ఇవ్వడం జరిగింది. ఈ 8 సంవత్సరాల కాలంలో ఏఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించారో మీరు వివరాలు అందించగలరా?
10) మీ 8 సంవత్సరాల పాలనలో దాదాపు 30 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మీ అసమర్థ పాలన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి మీ సమాధానమేంటి?
11) రైతులకు లక్షరూపాయలు రుణమాఫీ చేస్తామని 2014, 2018 ఎన్నికల్లో మీరిచ్చిన హామీ ఎంతమేరకు నెరవేర్చారు? మాకున్న సమాచారం ప్రకారం ఇంకా 31 లక్షల మంది రైతులకు రుణ మాఫీ చేయాల్సి ఉంది. ఈ హామీని ఎప్పటిలోగా మీరు నెరవేరుస్తారు?
12) వరి వేస్తే ఉరి అని, రైతాంగాన్ని భయబ్రాంతులకు గురిచేసి రైతులు వరి పండించకుండా అడ్డుకుంది మీరు కాదా. తెలంగాణ రైతాంగాన్ని నిలువునా ముంచి కేంద్రంపై మొసలి కన్నీరు కార్చడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా?
13) కేసీఆర్‌ జమానా-అవినీతి ఖజానా అంటూ సకలజనులు తెలంగాణలో ఘోషిస్తున్నారు. ప్రగతిభవన్‌ అవినీతి భవన్‌గా, తెలంగాణ ద్రోహులకు నిలయంగా మారిందన్నది వాస్తవం? దీనికి మీ జవాబు ఏంటి? 2014లో మీరు ముఖ్యమంత్రి పదవిచేపట్టే నాటికి మీ ఆస్తులు, మీ కుటుంబ సభ్యుల, మీ బంధువుల ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంత? మీ ఆస్తులు లక్ష రెట్లు పెరిగిన మాట నిజం కాదా? దీనిపై చర్చకు మీరు సిద్ధమా?
14) కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రీడిజైనింగ్‌ పేరిట అంచనాలు పెంచి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మీరు కొల్లగొట్టారా లేదా? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, ఇతరసాగునీటి ప్రాజెక్టులు నిర్మాణంలో, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, విద్యుత్‌ ప్రాజెక్టుల, విద్యుత్‌ కొనుగోళ్లు, ప్రభుత్వ భూములు అమ్మకాల్లో కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, వీటికి సంబంధిచిన ఫైల్స్‌, సంబంధిత పత్రాలు అఖిలపక్షం ముందు పెట్టి దీనిపై చర్చించడానికి మీరు ముందుకువస్తారా?
15) 2014 ఎన్నికల సందర్భంగా మీరు విడుదల చేసిన మ్యానిఫెస్టోలో పేజీ నెం.14లో బలహీన వర్గాలకు గృహ నిర్మాణం అనే అంశం కింద ‘‘ఇల్లు లేని నిరుపేదలకు 125 గజాల స్థలంలో 3 లక్షల రూపాయల వ్యయంతో రెండు పడక గదులు, ఒక హాలు, ఒక వంటగది, స్నానాల గది, మరుగుదొడ్డి ఉన్న ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని మీరు హామీ ఇచ్చారు. ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎన్ని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించారు? ఎన్ని పేదలకు ఇచ్చారు? వీటికి లెక్కలు చెప్పగలరా? ఈ ఇళ్లు మాకు చూపించగలరా?
16) ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2 లక్షల 91 వేల ఇండ్లను తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేస్తే, అందులో ఎన్ని ఇండ్లను పూర్తి చేశారు? వాటి వివరాలను ఇవ్వగలరా? గజ్వేల్‌, సిరిసిల్ల, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించారు..? మిగితా 116 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించారు? వీటి వివరాలు తెలంగాణ ప్రజలకు తెలుపుగలరా?
17) 2014 నుండి 2022 వరకు కేంద్రంలోని ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నుండి వివిధ సంక్షేమ పథకాలకు ఎన్ని నిధులు మంజూరు చేసింది, ఎన్ని నిధులు వచ్చాయి తదితర అంశాలపై మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ చర్చకు మీరు సిద్ధమా?
18) నిజాం షుగర్‌ పునరుద్ధరణ, నిజామాబాద్‌ జిల్లాలో చెరుకు పరిశోధనా కేంద్రం, పాలమూరు జిల్లాలో చేపల పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఎన్నికల హామీ ఏమైంది? ఈ హామీ ఎప్పుడు నెరవేరుస్తారు?
19) మిషన్‌ కాకతీయను ‘కమీషన్‌ కాకతీయగా మార్చి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీ పార్టీ వారు దోచుకోలేదా? దీనిపైనా జ్యూడిషల్‌ ఎంక్వయిరీకి మీరు సిద్ధమా? మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో కమిషన్ల కోసం ప్రాధాన్యం లేని చెరువులకు పనులు చేపట్టారని ‘కాగ్‌’ తప్పుపట్టిన మాట వాస్తవం కాదా?
20) కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి 575 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా 299 టీఎంసీలు నీటి వాటాకు ఒప్పుకొని తెలంగాణ రాష్ట్రానికి మీరు తీరని ద్రోహం చేసిన మాట వాస్తవం కాదా?
21) దేశంలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తెలంగాణలో ఎక్కువగా ఉన్న మాట వాస్తవం కాదా? పెట్రోల్‌, డీజిల్‌ ధరలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎంత ఉన్నాయి, తెలంగాణలో ఎంత ఉంది? దీనిపైన చర్చించడానికి మీరు సిద్ధమా?

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • telangana
  • TRS party
  • TRS Plenary

తాజావార్తలు

  • Tamil Nadu: రేపు లోక్‌భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు

  • Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్‌ను ఎవరు పాలిస్తారు.?

  • Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..

  • Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..

  • Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions