తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర నేడు 9వ రోజు కొనసాగుతోంది. అయితే పాదయాత్ర వద్ద డీకే అరుణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేడు పాదయాత్ర చేపట్టడంతోనే ఆర్డీఎస్ సమస్యను పరిష్కారించిన ఘనత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి దక్కుతుందన్నారు. 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాయడం వల్లనే జరిగిందని మోసపూరిత మాట్లాడటం సరిగదాని కర్నూలు, పోలీసులతో అలంపూర్, గద్వాల రైతులు యుద్దవాతవరణం మధ్య ఆర్డీఎస్ రంధ్రాలను మూయించడం జరిగిందన్నారు. ఆర్డీఎస్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయిస్తారా లేదా మీ స్పష్టత ఏంటో చెప్పాలని ఆమె అన్నారు. ఆర్డీఎస్ పై నీళ్లు ఉండి నీళ్లు రాని దుస్థితి, 15.9 టీఎంసీలు ఉండగా 6 టీఎంసీల నీటిని వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
నిరంజన్ రెడ్డి ఆర్డీఎస్‌ను అభివృద్ధి చేస్తామంటే అడ్డువచ్చినా వారెవరో చెప్పాలన్నారు. వలసల కరువుల జిల్లాపై మీకున్న జ్ఞానం ఏపాటిదో తెలపాలని, ఆర్డీఎస్ పై తోక తెల్వదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 142 కిలోమీటర్ల ప్రధాన కాల్వ పొడవు 100 కిలోమీటర్ల పొడవు 80 వేల ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టు 20 వేల ఎకరాలకు నీరు అందుతుంటే దేనికోసం ఆర్డిఎస్ పై మీ చిత్తశుద్ధి ఏ పాటిదన్నారు. 8 ఏండ్ల నుండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆర్డీఎస్ పై మీరు చేసిన పురోగతి ఏంటో స్పష్టం చేయాలని ఆమె అన్నారు.