టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ధనిక రాష్ట్రం అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన సందర్భంగా ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అయితే ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పార్టీ ఆస్తులను ప్రకటించిన కేసీఆర్ తన కుటుంబం ఆస్తులను ఎందుకు ప్రకటించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రోజుకో మాట చెబుతున్నారని విమర్శించారు. బండి సంజయ్ ప్రెస్ మీట్ పూర్తిగా చూడాలంటే కింది వీడియోను క్లిక్ చేయండి.