తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం వాడివేడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి హరీష్‌రావు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. హరీష్ రావు మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి టీఆర్ఎస్ సర్కార్‌ను ఆడిపోసుకోవడం కాదు.. కేంద్రం నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన డబ్బులు ఇప్పించండని ఆయన సవాల్ విసిరారు. మూడు లక్షల కోట్లు కేంద్రం తెలంగాణకు ఎక్కడ ఇచ్చింది…? చెప్పండని ఆయన ప్రశ్నించారు.
గ్రామాలకు నిధులు అంతా బీజేపీ సర్కార్ ఇస్తే.. దేశంలోని పల్లెలు అంత… తెలంగాణ పల్లెలా ఎందుకు లేవని ఆయన అన్నారు. ఇద్దరం కలిసి రాయిచూర్ పోదాం.. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా.. బండి సంజయ్.. ఇద్దరం కలిసి పోయి చూద్దామన్నారు. రాయిచూర్ ప్రజలు వచ్చి తెలంగాణలో అమలవుతున్న పథకాలు కర్ణాటకలో పెట్టమని వినతి పత్రం ఇచ్చారన్నారు.
కేంద్రమే గ్రామాలకు నిధులు ఇస్తే దేశంలోని ప్రతి గ్రామంలో నర్సరీలు, వైకుంఠధామలు, ట్రాక్టర్ లు ఉండాలి కదా ? అన్నారు. ఎన్డీఏ సర్కార్ సెస్ ల రూపంలో తీసుకుని రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయంను తగ్గించారని, సెస్‌ల రూపంలో వచ్చిన ఆదాయంను కేంద్రం రాష్ట్రాలకు ఎందుకు పంచరు అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాలను బలహీనపరిచే కుట్ర చేస్తున్నది ఎన్డీఏ సర్కార్ అని ఆయన వెల్లడించారు.