ప్రశ్నించే వారిని టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వరంగల్ జిల్లా పెరమాండ్ల గూడెం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించాడాన్ని తీవ్రంగా ఖండించారు. ల్యాండ్ పూలింగ్ పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వం భూములను సేకరించాడన్ని వ్యతిరేఖిస్తే అరెస్ట్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సీఐ, పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అమాయకులపై థర్డ్…
ఇవాళ హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని కాంగ్రెస్ నేతలు వీహెచ్, భట్టి విక్రమార్క, సీతక్క తదితరులు చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని సందర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు కరోనా నుంచి సోనియా గాంధీ కోలుకోవాలని పూజలు చేశారు. భాగ్యలక్ష్మీ అమ్మవారు హిందువులందరికీ దేవత అన్న కాంగ్రస్ నేతలు.. బీజేపీ నేతల తీరును తప్పుబట్టారు. బండి సంజయ్ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ చార్మినార్‌లో గల భాగ్యలక్ష్మి అమ్మ వారి…
తెలంగాణలో కొత్తగా భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం, చార్మినార్ వివాదం నడుస్తోంది. స్థానిక కాంగ్రెస్ లీడర్ రషీద్ ఖాన్ చార్మినార్ వద్ద నమాజ్ చేసుకోవడానికి అనుమతి కావాలంటూ సిగ్నేచర్ క్యాంపెయిన్ ప్రారంభించడం వివాదానికి కారణం అయింది. భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు జరుగుతున్నప్పుడు.. నమాజ్ కు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇది న్యాయపరమైన డిమాండ్ అని.. దీని కోసం సీఎం కేసీఆర్ ను కలుస్తా అని అన్నారు. దీంతో బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే బండి…
తెలంగాణలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. భాగ్యలక్ష్మీ ఆలయంపై రాజకీయ రచ్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ స్థానిక నేత రషీద్ ఖాన్, చార్మినార్ వద్ద నమాజ్ చేసుకునేందుకు అనుమతి కోసం సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. భాగ్యలక్ష్మీ దేవాలయంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. భాగ్యలక్ష్మీ అమ్మవారు మాకు ఇష్ట దైవం అని..దేవాలయం గురించి ఎంత దూరమైనా వెళ్తామని.. మేం చార్మినార్ తొలగించాలని…
అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే.. ఇరు పార్టీలు తెలంగాణలో ఎన్నికల తరహా వాతావరణాన్ని తీసుకువచ్చాయి. తాజాగా తెలంగాణ ఏర్పాటు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ డెవలఫ్‌మెంట్ కు కేంద్రం మోకాలడ్డు పెడుతుందని టీఆర్ఎస్ అంటుంటే.. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కప్పగా మార్చారంటూ బీజేపీ ఫైర్ అవుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్…
కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ సంతకాల సేకరణ చేపట్టడంపై తెలంగాణ బీజేపీ అద్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే భాగలక్ష్మి ఆలయంపై చేయి వేయాలంటూ సవాల్ విసిరారు. ‘‘మేం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటేనే.. మీకు నమాజ్ గుర్తొచ్చిందా?. అంతకుముందు నమాజ్ ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్మినార్ దగ్గర ఆలయం లేదని చెప్పేవాడు మూర్ఖుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలే…
ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీజేపీలో వలస నేతలకు నిప్పులపై నిల్చున్నట్టు ఉందట. హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో ఈటల రాజేందర్‌తోపాటు హుజూరాబాద్, పెద్దపల్లి, కరీంనగర్‌లోని పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు కాషాయ కండువా కప్పుకొన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత జిల్లా బీజేపీలో ప్రాధాన్యం దక్కుతుందని లెక్కలేసుకున్నారట. అప్పటికే పార్టీ పదవుల కోసం జిల్లాలో సీనియర్లు, జూనియర్లు అనే యుద్ధం జరుగుతోంది. ఈ పోరులో వలస నేతలు గుర్తింపు కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉన్నట్టు చెవులు…
తెలంగాణలో పంచాయతీలకు నిధులు, సర్పంచులకు పెండింగ్ బిల్లుల వ్యవహారంపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. గ్రాామాల్ల పనులు చేసిన సర్పంచులకు బిల్లులు చెల్లిచడం లేదని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని.. అయినా సర్పంచులకు బిల్లులను దాదాపుగా క్లియర్ చేశామని, మిగతావి త్వరలోనే క్లియర్ చేస్తామని మంత్రులు చెబుతున్నారు. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పందించారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రాంగ్ రూట్లో తీసుకెళ్లవద్దని బీజేపీ పార్టీకి…
కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే తెలంగాణ లేకుండా అసలు అవార్డులే లేవని. కేంద్రం సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద దేశంలో 20 గ్రామాలు ప్రకటిస్తే తెలంగాణలోని 19 గ్రామాలకు అవార్డులు వచ్చాయని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ బండి సంజయ్ తొండి సంజయ్ అని.. రేవంత్ రెడ్డిది గోబెల్స్ ప్రచారం అని విమర్శించారు. బీజేపీ పాలిత 19 రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిత చత్తీస్ గఢ్ లో అవార్డులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బిల్లులు ఇవ్వలేదని…
నామినేషన్ల ఘట్టం ముగియడానికి కొన్నిగంటల ముందు బీజేపీ జాతీయ నాయకత్వం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్‌ని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆయన ఉత్తరప్రదేశ్ కోటాలో రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. తెలంగాణ నుంచి ఒకరికి రాజ్యసభ అవకాశం వస్తుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ సీటును తెలంగాణకే ఎందుకు ఇచ్చింది? అందులోనూ లక్ష్మణ్‌నే ఎందుకు ఎంచుకుంది అనేది ప్రస్తుతం చర్చగా మారింది. తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెరిగింది. ఇక్కడ…