ఆర్టీసీ ఛార్జీలను 60 శాతం పెంచిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్ కే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) వద్ద బీజేపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఈ సందర్భంగా.. బండి సంజయ్ అక్కడికి చేరుకుని ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడారు. జగిత్యాల వైపు వెళ్లే బస్సులో ప్రయాణికులతో మాట్లాడి ఛార్జీల పెంపుపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో…
బీజేపీలో రాష్ట్ర కమిటీ కంటే పవర్ ఫుల్ కోర్ కమిటీ. ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రధాన నాయకులతో ఆ కమిటీని ఏర్పాటు చేస్తుంది జాతీయ నాయకత్వం. ఇందులో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కూడా ఉంటారు. అయితే తెలంగాణలో విస్తరించాలని.. అధికారంలోకి రావాలని చూస్తోన్న కమలనాథులు.. కోర్ కమిటీ ఏర్పాటు ఊసే ఎత్తడం లేదు. దీనిపై మాట్లాడేవారు .. ప్రశ్నించేవారూ కూడా కరువయ్యారు. ప్రధాని మోడీ.. అమిత్ షా, జేపీ నడ్డా వంటి అగ్రనేతలు తెలంగాణకు వచ్చి…
బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘట్ కేసర్ టోల్ గేట్ సమీపంలో జిట్టాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సంజయ్.. జూన్ 2న ‘‘అమరుల యాదిలో.. ఉద్యమ ఆకాంక్షల సాధన సభ’’ను జిట్టా నిర్వహించారని తెలిపారు. కేసీఆర్ ను కించపరిచే విధంగా ఆ సభలో స్కిట్ వేయించారని టీఆర్ఎస్ నేతల ఫిర్యాదుపై జిట్టాను పోలీసులు అరెస్ట్ చేశారు. జిట్టాను పోలీసులు అర్దరాత్రి అదుపులోకి తీసుకోవడంపై సంజయ్…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ జేబీఎస్ వద్ద నిరసనకు బండి సంజయ్ పిలుపు నిచ్చారు. దీనిలో భాగంగా జేబీఎస్ వద్ద నిరసన కార్యక్రమానికి బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లకుండా మందస్తుగా బండి సంజయ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ లోని ఆయన నివాసం వద్ద పోలీసులు చుట్టుముట్టి బండి సంజయ్ బయటకు రాకుండా అడ్డుకున్నారు.…
జూలై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేవాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. భేటీ సందర్భంగా తెలంగాణ సంస్కృ తీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రముఖు లకు స్వాగతం పలకాలని రాష్ట్ర శాఖ నిర్ణ యించింది. ఒకరోజు పూర్తిగా తెలంగాణ, ఆంధ్ర వంటకాలతో అతిథులకు ప్రత్యేక ఆతిథ్యం ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే నెల 2, 3 తేదీల్లో ఈ సమావేశాలు జరగ నున్న నోవాటెల్–హెచ్ఐసీసీని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్‌చుగ్, సంస్థా గత వ్యవహారాల సహాయ…
జూబ్లీహిల్స్ అత్యాచార సంఘటన జరిగినప్పటి నుంచి ప్రభుత్వం నిందితులను కాపాడే ప్రయత్నం చేసిందని.. చట్టాన్ని కాపాడే వారే ఈ కేసును నీరుగార్చడానికి అనేక కుట్రలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ స్పందించి ఆందోళన చేస్తే ఈ మాత్రం చర్యలైనా తీసుకున్నారని ఆయన అన్నారు. మొదటి నుంచి ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగాని తనంలో ఉన్నారని విమర్శించారు. ఫార్మ్ హౌజ్ కే పరిమితం అయ్యారని…
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మొన్నటి వరకు అత్యాచార ఘటనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడితే.. ఎమ్మెల్యే రఘునందర్ రావు మరిన్ని ఆధారాలు బయటపెట్టడం, బాధిత అమ్మాయి విజువల్స్, ఫోటోలను బయటపెడ్డటంతో ఇంకో టర్న్ తీసుకుంది ఈ కేసు. అత్యాచార బాధితురాలి ఫోటోలు, విజువల్స్ ఎలా బయటపెడుతారంటూ.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ పార్టీతో పాటు రఘునందన్ రావుపై ఫైర్ అవుతున్నాయి. తాజాగా ఈ వివాదంలో రఘునందన్…
చెంచల్ గూడ జైల్లో ఉండాల్సిన వారిని కాపాడటానికి పోలీసులు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ అత్యాచార ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ లు చేసి జైళ్లలో వేస్తున్నారని..అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు హోంమంత్రి పైనే ఆరోపణలు వస్తున్నాయి.. కానీ హోంమంత్రినే విచారణ చేయాలని ట్విట్టర్లో కొంతమంది మాట్లాడుతున్నారని విమర్శించారు. హోం మంత్రి, డీజీపి ప్రగతి…
ఆమ్నేషియా పబ్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. అమ్మాయిపై సామూహిక లైంగిక దాడి చేసిన కేసులో పెద్దపెద్ద వ్యక్తుల కుమారులు ఉన్నట్లుగా బీజేపీ ఆరోపిస్తోంది. ఏకంగా హోంమంత్రి మనవడు కూడా ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని, ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డ్ కు సంబంధించిన పెద్ద వ్యక్తి కుమారుడు, ఓల్డ్ సిటీకి సంబంధించిన ఓ పత్రికా ఎండీ కుమారుడు కూడా ఈ కేసులో ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. మరోవైపు రాజాసింగ్…