దేశవ్యాప్తంగా రైతుల ప్రయోజనాలు, శ్రేయస్సు కోసం కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని.. రైతులకు భారం పడకుండా భారీ సబ్సిడీతో ఎరువులను అందిస్తున్న ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా అర్హులైన రైతులకు కేంద్రం ఏటా 3 విడతల్లో రూ. 2000 చొప్పున 6000 అందిస్తుందని చెప్పారు. రైతును రాజు చేయాలనే కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం అహర్నిశలు…
హైదరాబాద్ లో బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా రేపు రాష్ట్రానికి బిజెపి జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ రానున్నారు. కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో వీరిద్దరి పర్యటన సాగనుంది. రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు స్థలాల పరిశీలన, సన్నాహకం సమావేశాన్ని నిర్వహించనున్నారు.ఇప్పటికే రాష్ట్ర నేతలతో ఏర్పాట్ల కమిటీని ఏర్పాటు చేశారు. జూలై నెలలో కార్యవర్గ సమావేశాలు జరనున్నాయి.రేపటి పర్యటన తర్వాత జాతీయ…
ప్రధాని నరేంద్ర మోడీకి సిఎం కెసిఆర్ డబ్బులు ఇచ్చినట్లు బండి సంజయ్ ఒప్పుకుంటున్నాడా? అని చురకలంటించారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య జరిగిన లావాదేవీలో కుంభకోణం ఉంటుందా? అని ప్రశ్నించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు యంత్రాలను అందజేసింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలేనని బండి సంజయ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి సామాగ్రిని కేంద్ర ఆధీనంలో ఉన్న బిహెచ్‌ఇఎల్ ఇచ్చిందన్నారు. టెండర్ల ద్వారా బిహెచ్‌ఇఎల్…
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీకి కొత్త జవసత్వాలు రాకపోగా.. నియోజకవర్గాల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు భగ్గుమంది. కొత్తగా కాషాయ కండువా కప్పుకొన్న నేతలు ఉత్సాహంగా దూసుకెళ్దామని చూస్తుంటే పార్టీలోకి పాతకాపులు వారి కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారట. వలస నేతలు రావడంతో నియోజకవర్గాల్లో నాయకత్వానికి కొరత తీరుతుందని భావిస్తే.. ఆ దిశగా అడుగులే పడటం లేదట. దాదాపు నెల రోజుల పాటు అలంపూర్ మొదలు షాద్‌నగర్ వరకు సంజయ్…
తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ మాటలను, నాయకులు, అధికారుల మాటలను పట్టించుకునే పరిస్థితి లేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. బొగ్గు దిగుమతి అంశంలో కేసీఆర్ ప్రజలను పక్కదోవ పట్టించారని అన్నారు. రాష్ట్రం ముఖ్యమంత్రి విచ్చల విడి అవినీతితో తెలంగాణను అప్పు ల పాలు చేశారని.. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసే పరిస్థితి లేదని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగం సంస్థల నుంచి అప్పులు తెచ్చాడని.. కొత్తగా అప్పులు వచ్చే పరిస్థితి…
తెలంగాణలో చరిత్ర కలిగిన శివాలయ అభివృద్ధికి నిధులు ఏదైనా తెచ్చవా..? మసీదు తవ్వితే శివ లింగాల గురించి పక్కన పెట్టు.. కాకతీయుల కాలం నుంచి ఉన్న శివాలాయాలకు నిధులు ఏమైనా ఇప్పించావా.? అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సంగారెడ్డి లో కల్పకుర్ గ్రామంలో వెయ్యేళ్ళ క్రితం శివాలయం ఉందని.. ఈ దేశాలయానికి కేంద్రం నుంచి నిధులు ఇప్పంచు అని డిమాండ్ చేశారు. తవ్వకాలు వదిలి, భూమి మీద…
తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టిందా? రాబోయే రోజుల్లో కమలదళం దూకుడు పెంచుతుందా? అంటే అవుననే అనిపిస్తోంది.2023 ఎన్నికలకు బీజేపీ ఇప్పటినుంచే స్కెచ్చేస్తోంది. మరో వైపు బీజేపీ జాతీయ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఆ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జూలైలో జరగబోతున్నాయి. దీనికి సబంధించి కమలదళం ఇప్పటినుంచి ఏర్పాట్లు మొదలుపెట్టింది. తెలంగాణపై బిజెపి కేంద్ర నాయకత్వం సీరియస్గా ఫోకస్ చేసింది. ఎలాగైనా కాషాయ జెండా ను ఎగిరే యాలని వ్యూహ రచన చేస్తున్నారు..…
తెలుగు జాతి గర్వించదగ్గ మహా నటుడు పద్మశ్రీ నందమూరి తారకరామారావు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలనే మలుపు తిప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా బీజేపీ తెలంగాణ శాఖ తరపున ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పౌరాణికం మొదలు జానపదం, జేమ్స్ బాండ్ సినిమాల వరకు అన్ని రకాల పాత్రలు పోషించి తెలుగు…