Breaking: బండి సంజయ్ హౌజ్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ జేబీఎస్ వద్ద నిరసనకు బండి సంజయ్ పిలుపు నిచ్చారు. దీనిలో భాగంగా జేబీఎస్ వద్ద నిరసన కార్యక్రమానికి బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లకుండా మందస్తుగా బండి సంజయ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
బంజారాహిల్స్ లోని ఆయన నివాసం వద్ద పోలీసులు చుట్టుముట్టి బండి సంజయ్ బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో సామాన్యుడిపై భారం వేశారని.. జేబీఎస్ లో నిరసన చేసి తీరుతామని బండిసంజయ్ అన్నారు.
Also Read
ప్రజాస్వామ్యయుతంగా ఆర్టీసీ ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడానికి కూడా వెళ్లనివ్వరా..? అంటూ ట్విటర్ ద్వారా బండి సంజయ్ ప్రశ్నించారు. ఆర్టీసీ చార్జీలు పెంచడం మూర్ఖత్వం కాదా..? అంటూ నిలదీసారు. టీఆర్ఎస్ సర్కారు మూడేళ్లలో ఐదుసార్లు చార్జీలు పెంచింది. పేదలను బస్సుల్లో కూడా తిరగనివ్వరా..? నడుచుకుంటూ తిరగాలా..? అంటూ మండిపడ్డారు.
టీఆర్ఎస్ సర్కారు వచ్చినప్పటి నుంచి 60 శాతం చార్జీలను పెంచింది. పేదలు గరీబ్ రథంగా భావించే ఆర్టీసీ ఛార్జీలు పెంచడం వల్ల కేసీఆర్ పేదల ఉసురుపోసుకోక తప్పదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మేం ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు వెళ్లట్లేదు, ఇండ్లు ముట్టడించాల్సిన అవసరం పోలీసులకు ఎందుకొచ్చింది..? అంటూ ప్రశ్నించారు. రేపిస్టులను అరెస్టులు చేయడం చేతకాదు కాని, పోలీసులు బిజెపి నాయకుల ఇండ్లను ముట్టడించడం ఏంటి..? అని నిప్పులు చెరిగారు.
రాజకీయ పార్టీలు ఇండ్లు ముట్టడించడం చూశాం.. కాని, పోలీసులే ఇలా ఇండ్లను ముట్టడించడం టీఆర్ఎస్ హయాంలోనే చూస్తున్నామని విమర్శించారు. ఇదే పోలీసు ఫోర్స్ రేపిస్టులను, క్రిమినల్స్ ను కట్టడి చేస్తే బాగుంటుంది. శాంతి భద్రతల సమస్య ఉండదు. నిర్భందాలు, అరెస్టులు, కేసులతో బీజేపీని అడ్డుకోలేరని బండిసంజయ్ ట్విటర్ ద్వారా హెచ్చరించారు.
ఇదే పోలీసు ఫోర్స్ రేపిస్టులను, క్రిమినల్స్ ను కట్టడి చేస్తే బాగుంటుంది. శాంతి భద్రతల సమస్య ఉండదు. నిర్భందాలు, అరెస్టులు, కేసులతో @BJP4Telangana ఉద్యమాన్ని ఆపలేరు.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 10, 2022
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..