తెలంగాణలో రాక్షస, నయా నిజాం పాలన సాగుతోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ పార్టీ నుంచి సామ వెంకట్ రెడ్డి, నవతా రెడ్డి బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యమకారుల పార్టీగా చెప్పుకునే టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు స్థానం లేదని.. ఉద్యమ ద్రోహులకు టీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో స్థానం కల్పించారని విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచడానికి బీజేపీ కృషి చేస్తోందని ఆయన అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలకు భిన్నంగా రాష్ట్ర ముఖ్యమంత్రి…
తెలంగాణలోని కొంత మంది సీనియర్ నేతల తీరు బండి సంజయ్‌కి ఇబ్బందికరంగా మారిందట.. వారి వ్యవహార శైలిపై ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.. అంతే కాదు.. ఢిల్లీ పెద్దల దగ్గర తన ఆవేదన వ్యక్తం చేశారట బండి సంజయ్.
మోడీ నిర్ణయాలతో బాబా సాహెబ్ అంబేద్కర్ తృప్తి చెందుతారని రాష్ట్ర అద్యక్షుడు అన్నారు. ప్రధాని మోడీ, జేపీ నడ్డాల కృషితోనే ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కాబోతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. కాగా.. ప్రధాని మోదీ, బీజేపీ అద్యక్షుడు జేపీ నడ్డాకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీలకు అవకాశం ఇచ్చినందుకు ప్రశంసల వర్షం కురిపించారు. ద్రౌపతి ముర్ము తల్లిగా దేశ సేవ చేస్తారని ఆకాంక్షించారు. జులై 3న సికింద్రాబాద్ ప్రధాని మోడీ సభకు గిరిజన,…
మీరు మరో ‘‘నిరో చక్రవర్తి’’ గా వ్యవహరిస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ రాసారు. బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కారించాలని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థ బాసరలోని ట్రిపుల్ ఐటి సంస్థ అని పేర్కొన్నారు. బాసరలోని ట్రిపుల్ ఐటి విద్యార్థులు గత ఆరురోజులుగా వేల మంది విద్యార్థులు వారి న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుందని తెలిపారు.…
వచ్చే నెల 2,3 తేదీల్లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదారాబాద్‌లో జరగబోతున్నాయి. ఈ సమావేశాల ద్వారా తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం తీసుకురావాలని పార్టీ పెద్దలు లెక్కలేస్తున్నారు. ఇందుకోసం వివిధ కార్యక్రమాల రూపకల్పన చేశారు కమలనాథులు. 3న ప్రధాని మోడీతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రధానితోపాటు ముఖ్య నేతలంతా సభకు హాజరవుతారు కూడా. అందుకే కనీవినీ ఎరుగని రీతిలో సభను సక్సెస్ చేయాలన్నది బీజేపీ ఆలోచన. ఇటీవల జరిగిన బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు,…
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపును పురస్కరించుకుని జులై 3న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలుగా ఉంది. ఈ సభకు ప్రధానమంత్రి మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు. చరిత్రలో ఈ సభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని బీజేపీ యోచిస్తోంది. సభకు 10 లక్షల మందికిపైగా…
నిరసన చెప్పే పద్ధతి ఇది కాదని, అగ్నిఫథ్ మంచి స్కీమ్ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆర్మీలో సేవ చేయలనుకునే యువకులను 40 వేల మంది రిక్రూట్ మెంట్ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. రిక్రూట్ మెంట్ లో పది శాతం రిజర్వేషన్ ఉంటుందని చెప్పారు బండి సంజయ్. ఆర్మీలో పనిచేయాలని సేవ చేయాలని అనుకున్న వాళ్లకు మంచి అవకాశం మని…
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూల చర్యలు చేపట్టాలి. విద్యార్థులు ఆందోళన విరమించే దిశగా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు పవన్ కళ్యాణ్. ట్రిపుల్ ఐటీలను ఏ లక్ష్యం కోసం స్థాపించారో అది నెరవేరే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని పవన్ కోరారు. గత కొద్దిరోజులుగా…