దక్షిణ తెలంగాణను పూర్తిగా ఎడారిగా మార్చిన తెలంగాణ ద్రోహివి అని కేసీఆర్ ను విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. లక్ష కోట్లు మింగి కాళేశ్వరాన్ని కట్టావని.. జూరాల, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల సంగతేంటని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం మొత్తం నీటిని దోచుకుంటుందని దాని గురించి మాట్లాడటం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు చాలా మంది ఉన్నారని.. మీ పార్టీలో ఏక్ నాథ్…
రోజులు దగ్గర పడ్డప్పుడు మాటలు ఇలాగే వస్తాయని.. జోగులాంబ అమ్మవారిని కంచపరిచే స్థాయికి చేరావ్ అని సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జోగులాంబ అమ్మవారిని తిట్టే స్థాయికి, వ్యంగంగా మాట్లాడే స్థాయికి వచ్చావంటే ఈ రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు.. ఫామ్ హౌజ్ లో పడుకోవాలని సలహా ఇచ్చారు. హిందు సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, లేకపోతే కరీంనగర్ లో పట్టిన గతే పడుతుందని అన్నారు.…
బీజేపీ తెలంగాణలో జోరు పెంచుతోంది. క్రమంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీ బైక్ ర్యాలీలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 21 నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ బైక్ ర్యాలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ‘ప్రజలు, పల్లె ఘోష బీజేపీ భరోసా’ పేరుతో బైక్ ర్యాలీలు చెపట్టనుంది. ఒక్కో నేతకు నాలుగు నియోజక వర్గాల్లో ర్యాలీలు అప్పచెప్పారు. మొత్తం 30 మంది నాయకులు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. ఒక్కో…
రాష్ట్ర పార్టీలో ఏకాభిప్రాయం ఉంటే అలాంటి వారిని వెంటనే చేర్చుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది బీజేపీ అధిష్టానం.. ఏకాభిప్రాయం రానివి ఉంటే తమ దగ్గరికి పంపించండి అని ఖరాఖండిగా చెప్పేశారట నడ్డా, అమిత్ షా
కేసీఆర్ ఎవరు కౌన్ కిస్కా.. అంటూ.. బండి సంజయ్ ఫైర్ అయ్యారు. నగరంలో పర్యటన ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద సోమవారం ప్రధాని మోదీకి బండి సంజయ్ వీడ్కోలు పలికిన అనంతరం ఎయిర్‌పోర్టులో బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం చెప్పారని , బీజేపీ.. కేసీఆర్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు.. ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని…
లా అండ్ ఆర్డర్ మాది లేకపోతే మీ వాళ్ళు తిరిగే వాళ్ళా అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీ శ్రేణులపై మండిపడ్డారు. బీజేపీ కేంద్రం ఏమిచ్చిందో శ్వేతా పత్రం ఇవ్వాలని కోరారు. తెలంగాణ లో ఆలయాల గురించి మాట్లాడారు కదా.. మరి దేవాలయాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు తలసాని. ధాన్యం కొనుగోలు గురించి ఇప్పటికి ఇంకా సందిడ్గం కొనసాగుతూనే వుందని అన్నారు. సింగిల్ ఇంజన్ సర్కార్ తోనే అన్నీ…
భారతీయ జనతా పార్టీ ప్రధాని మోడీతో నిర్వహించిన విజయ సంకల్ప సభ బాగా విజయవంతమైందని బీజేపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. లక్షలాది మంది తరలిరావడం.. ఏర్పాట్లు బాగా చేయడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భుజం తట్టడం.. ప్రధాని సహా ఇతర నేతలంతా హుషారుగా కనిపించడంతో రాష్ట్ర పార్టీ నాయకులు సంబరాలు అంబరాన్నంటాయి. అయితే.. మరోవైపు సభ విజయవంతం కావడం బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని…