Bandi Sanjay: రాష్ట్రంలో రాక్షస, నయా నిజాం పాలన కొనసాగుతోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాక్షస, నయా నిజాం పాలన సాగుతోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ పార్టీ నుంచి సామ వెంకట్ రెడ్డి, నవతా రెడ్డి బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యమకారుల పార్టీగా చెప్పుకునే టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు స్థానం లేదని.. ఉద్యమ ద్రోహులకు టీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో స్థానం కల్పించారని విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచడానికి బీజేపీ కృషి చేస్తోందని ఆయన అన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలకు భిన్నంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన కొనసాగుతుందని.. బీజేపీ ఒత్తడితోనే విద్యాశాఖలో తెచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారని బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఉద్యమకారుల పార్టీ అని వెల్లడించారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామన్న కేసీఆర్ ఆయన ఇంట్లో ఐదు ఉద్యోగాలు ఇచ్చి నెలకు రూ. 15 లక్షల జీతం ఇస్తున్నారని.. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఒక దరిద్రపు స్ట్రాటజీ టీమ్ ను పెట్టుకుని ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారని విమర్శించారు.
Also Read
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని..టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగులు, విద్యార్థులు, మహిళల తిరస్కరణకు గురైందన్నారు. మాఫియాకు అడ్డాగా హైదరాబాద్ మారడంతో రాష్ట్రానికి కంపెనీలు రావాలంటే భయపడాల్సి వస్తోందని.. మహిళలకు రక్షణ లేదని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని..పోలీసులు రక్షణ కల్పించలేని పరిస్థితి ఉందని ఆరోపించారు బండి సంజయ్.
సీఎం కళ్లు మూసుకుని ఉన్నారని.. దీంతో సంఘ విద్రోహులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో సంఘ విద్రోహుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారో తెలంగాణ బేరీజు వేసుకోవాలని సూచించారు. కేంద్రం నిధులను దారి మళ్లిస్తున్నారని.. మోదీకి మంచి పేరు రాకుండా ఉండేందుకు కేంద్రాన్ని కేసీఆర్ బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో సంక్షేమ పాలన కోసం బీజేపీకి ఒకసారి అధికారం ఇవ్వాలని కోరారు. అవుట్ సోర్సింగ్ పద్దతిలో తీసేసిన నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తా అని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ప్రైవేట్ కంపెనీలకు కొమ్ము కాస్తూ ప్రైవేట్ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
-
Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
The Paradise Collections: యాహూ ‘జడల్’ 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Oppo F35 Series: Oppo F35 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!