తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ కు మధ్య విభేధాలు ఉన్నట్లు గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాల్లో, వార్త ఛానెళ్లలో న్యూస్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ వార్తలపై స్వయంగా ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. తనకు బండి సంజయ్ మధ్య ఎలాంటి పోటీ ఏమి లేదని…. ఇక్కడ ఏమన్నా సీఎం, మంత్రి పదవులు ఉన్నాయా… నేను ఎప్పుడు గ్రూప్ లు కట్టలేదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ను కూడా అధికారంలోకి రారు అన్నారు…ప్రజల్లో నుండే నాయకులు పుట్టుకొస్తారు… వారే చరిత్ర నిర్మాతలు అవుతారని ఈటల స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ నాయకులతో.. తాను చాలా సాన్నిహిత్యంగా ఉంటున్నాని చెప్పారు ఈటల రాజేందర్. తనకు హుజూరాబాద్ నియోజకవర్గం ఉంది…. కానీ పార్టీ ఆదేశిస్తే సీఎం కేసీఆర్ మీద పోటీకి సిద్ధమౌవుతానని పేర్కొన్నారు ఈటల రాజేందర్. కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చడం అంటే కూట్ల రాయి తీయనోడు.. ఎట్లా రాయి తీసినట్టే అంటూ సీఎం కేసీఆర్ కు చురకలు అంటించారు. మంత్రిగా కాకున్నా మనిషిగా గుర్తించమని అడిగా… సీఎం పదవి ఎప్పుడు ఆశించలేదన్నారు. తెలంగాణలో బీజేపీ జండా ఎగరడం ఖాయమని.. టీఆర్ ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తాయనేది ఊహజనిత ప్రశ్న అని పేర్కొన్నారు.